Facebook BARS App: టిక్‌టాక్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ యాప్‌..

Arun Chilukuri
Updated on: 2 March 2021 1:00 PM IST
Facebook BARS App
X

 టిక్‌టాక్‌ మాదిరిగా ఫేస్‌బుక్‌ యాప్‌..

Facebook BARS App: టిక్‌టాక్‌ లోటు తీర్చడానికి ఎన్నో యాప్‌లు పుట్టుకవచ్చాయి. కానీ అవేవి టిక్‌టాక్‌ అంతా క్రేజ్‌ తెచ్చుకోలేదు. అయితే ఆ లోటు తీర్చేందుకు ఫేస్‌బుక్‌ సరికొత్త యాప్‌ను విడుదల చేసింది. షార్ట్ వీడియో ప్రియుల కోసం బార్స్ పేరుతో ఈ యాప్‌ను డిజైన్ చేశారు. బార్స్‌లోని ఫీచర్స్‌ టిక్‌టాక్‌ను మించి ఉన్నాయి. ఇందులోని ప్రీ-రికార్డెడ్‌ ఫీచర్‌తో మన సొంత పదాలకు ప్రొఫెషనల్‌‌ ర్యాప్‌ స్టైల్ వీడియోను రూపొందించొచ్చు. ఇక ఆడియో/వీడియో ఫిల్టర్స్‌ బోలెడన్నీ ఉన్నాయి. వాటితో పాటు క్లీన్, ఆటో ట్యూన్, ఇమేజినరీ ఫ్రెండ్స్‌, ఏమ్‌ రేడియో వంటి టూల్స్‌తో వీడియో కావాల్సినంత మ్యాజిక్‌ చేయవచ్చు. మొత్తానికి ఇది టిక్‌టాక్‌ని మించిపోయాలా ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story