Puzzle Challenge: 10 సెకన్లలో ఆ ఒక్క గులాబీని కనిపెడితే మీరు తోపులు!

Puzzle Challenge: 10 సెకన్లలో ఆ ఒక్క గులాబీని కనిపెడితే మీరు తోపులు!
x

Puzzle Challenge: 10 సెకన్లలో ఆ ఒక్క గులాబీని కనిపెడితే మీరు తోపులు!

Highlights

మరో ఆసక్తికరమైన పజిల్‌తో మేము మళ్లీ మీ ముందుకు వచ్చాం! నిన్నటి నేను ఎవరో గుర్తు పట్టారా అనే పజిల్ గుర్తుంది కదా? ఈరోజు పజిల్ కాస్త డిఫరెంట్.

మరో ఆసక్తికరమైన పజిల్‌తో మేము మళ్లీ మీ ముందుకు వచ్చాం! నిన్నటి నేను ఎవరో గుర్తు పట్టారా అనే పజిల్ గుర్తుంది కదా? ఈరోజు పజిల్ కాస్త డిఫరెంట్. పైన ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. మీకు ఈ చిత్రంలో ఒక బుట్ట నిండా అందమైన పసుపు రంగు డైసీ పువ్వులు కనిపిస్తున్నాయా. నిజానికి ఆ పూల మధ్య ఒకే ఒక్క పసుపు గులాబీ పువ్వు కూడా తెలివిగా దాక్కుని ఉంది. అది కూడా మిగిలిన పూలలాగే అందంగా వికసించి ఉండటంతో, మీకు దానిని గుర్తించడం అంత సులభం కాదు.

మీకు ఉన్న సమయం కేవలం 10 సెకన్లు మాత్రమే. టైం లిమిట్ లేకపోతే పజిల్ ఆడిన కిక్కు ఉండదు. అందుకే, కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసే లోపు ఈ పూల బుట్టలో ఆ గులాబీ ఎక్కడుందో కనిపెట్టండి. రెడీనా? ఒకటి... రెండు... మూడు... నాలుగు... ఐదు... ఆరు... ఏడు... ఎనిమిది... తొమ్మిది... పది. టైం అప్.. మీరు ఆ పసుపు గులాబీని 10 సెకన్లలోపు గుర్తించినట్లయితే, మీ పరిశీలనా శక్తి అద్భుతం. మీరు గొప్ప కంటి చూపు ఉన్నవారు అవుతారు. మీరు ఇంకా వెతుకుతున్నారా? చిన్న హింట్ ఏంటంటే.. డైసీ పువ్వుల రెక్కలు పొడవుగా ఉంటాయి, కానీ గులాబీ రెక్కలు గుండ్రంగా, ఒకదానిపై ఒకటి పొరలు పొరలుగా ఉంటాయి. చిత్రాన్ని మరోసారి నిశితంగా పరిశీలిస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది.





సమాధానం: మీరు కనిపెట్టిన సమాధానం సరైనదో కాదో చెక్ చేసుకోవడానికి, పైన ఇచ్చిన చిత్రంలో ఎరుపు రంగు సర్కిల్ (Circle) ఉన్న భాగాన్ని చూడండి. అక్కడే ఆ పసుపు గులాబీ దాక్కుని ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories