వెరైటీ పూజలు.. వానల కోసం వింత ఆచారం.. ఆ రాత్రికే కుండపోత వర్షం

వెరైటీ పూజలు.. వానల కోసం వింత ఆచారం.. ఆ రాత్రికే కుండపోత వర్షం
x

వెరైటీ పూజలు.. వానల కోసం వింత ఆచారం.. ఆ రాత్రికే కుండపోత వర్షం

Highlights

చిత్తూరు జిల్లా గ్రామాల్లో వింత ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. వర్షాలు కురవాలని కోరుతూ ప్రతి ఏడాది గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తాజాగా బైరెడ్డి పల్లి మండలం పాతపేట గ్రామంలో కప్ప దేవర్ల పండుగ ఘనంగా జరిగింది. ఈ పండుగ వర్షం కోసం గ్రామస్తులు ఏకమై నిర్వహించే సంప్రదాయ పూజ.

గ్రామంలోని గంగమ్మ గుడి పూజారి రామస్వామి పెద్ద కప్పను చేతిలో పట్టుకొని గ్రామంలోని ప్రతి ఇంటి ముందు తిరిగాడు. ప్రతి ఇంటి వారు కప్పకు పూజలు చేసి, వంటకు కావలసిన నిత్యావసర సరుకులు సమర్పించారు. సేకరించిన అన్ని పదార్థాలను గ్రామ పొలిమేరలోని చెరువు వద్దకు తీసుకెళ్లి, అక్కడ మట్టితో గంగమ్మ ప్రతిమను తయారు చేసి ప్రతిష్టించారు.

కప్పకు, గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, అన్నప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామస్తులు అందరూ కలిసి అక్కడే భోజనం చేసి, కప్ప దేవర్ల పండుగను ఘనంగా జరుపుకున్నారు. చివరగా కప్పను తిరిగి చెరువులో వదిలి, వర్షాలు సమృద్ధిగా కురవాలని మొక్కుకున్నారు.

అద్భుతమేమిటంటే, పూజలు ముగిసిన కొద్ది సేపటికే భారీ వర్షం కురిసింది. గ్రామస్తుల నమ్మకం నిజమై, రాత్రంతా కుండపోత వర్షం కురవడంతో గ్రామమంతా ఆనందంలో మునిగిపోయింది. కప్పలను ఊరేగించి పూజలు చేస్తే వర్షాలు వస్తాయని గ్రామస్థులు విశ్వసిస్తూ, ఈ సంప్రదాయాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories