Viral: కాకిని తాడుతో కట్టేసిన చికెన్‌ షాప్‌ యజమాని.. మిగతా కాకులు ఏం చేయాయో చూడండి

Group of crows fly at the chicken shop video goes viral in social media
x

Viral: కాకిని తాడుతో కట్టేసిన చికెన్‌ షాప్‌ యజమాని.. మిగతా కాకులు ఏం చేయాయో చూడండి 

Highlights

Viral: కాకిని తాడుతో కట్టేసిన చికెన్‌ షాప్‌ యజమాని.. మిగతా కాకులు ఏం చేయాయో చూడండి

Viral: సాధారణంగా ఐక్యమత్యం అనగానే మనుషులే ఉంటుందని అనుకుంటాం. అయితే ఇది ఒక్కప్పటి మాట. ప్రస్తుత బిజీ జీవితంలో పక్కవాడి గురించి కూడా పట్టించుకునే నాదుడు లేకుండా పోయాడు. ఎవరి జీవితం వారిది. ఐక్యమత్యం అనే మాటకు స్థానమే లేకుండా పోయింది. అయితే మూగ జీవాలు మాత్రం ఐక్యమత్యంతో ఉంటున్నాయి. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో చూస్తే కాకుల్లో ఉన్న ఐక్యమత్యం మనుషుల్లో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తోంది.

వివరాల్లోకివెళితే.. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్‌లో ఓ వ్యక్తి చికెన్‌ షాప్‌ నడిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతీ రోజూ తన దుకాణం వద్దకు ఓ కాకి వస్తూ ఇబ్బంది పడుతోంది. కావ్‌ కావ్‌ అంటూ ఇరిటేట్ చేస్తోంది. అయతే అంతటితో ఆగకుండా నెమ్మదిగా చికెన్‌ ముక్కలను ఎత్తుకెళ్లిపోతోంది. ఎన్నిసార్లు తరిమికొట్టినా మళ్లీ మళ్లీ కాకి వస్తూనే ఉంది. దీంతో విసుగుచెందిన సదరు దుకాణం యజమాని కాకిని తాడుతో కట్టి దుకాణం వద్ద కట్టేశాడు. దీంతో కాకి అక్కడి నుంచి వెళ్లని పరిస్థితి ఎదురైంది. దాంతో కాకి అరవడం మొదలు పెట్టింది. ఆ అరుపులు విన్న ఇతర కాకులు షాప్‌ వద్దకు వచ్చాయి. ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో కాకులు తమ స్నేహితుడిని కాపాడడం కోసం షాపుపై దండెత్తాయి.

చికెన్‌ షాప్‌ చుట్టూ చేరి కావ్‌ కావ్‌ అంటూ బిగ్గరంగా అరవడం మొదలు పెట్టాయి. అయితే అవి ఎంత అరుస్తున్నా యజమాని తొలుత కాకిని వదల్లేదు. దీంతో వాటి అరుపులను భరించలేక పక్కనున్న దుకాణం దారులు వదిలేయని కోరగా చేసేది ఏం లేక చికెన్‌ షాప్‌ యజమాని కాకిని వదిలేశాడు. దీంతో కాకి తుర్రుమని అక్కడి నుంచి వెళ్లిపోయాయి. తన స్నేహితుడిని విడింపుచుకున్నామన్న సంతోషంగా మిగతా కాకులు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. దీనంతటనీ ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. కాకుల ఐక్యమత్యం చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇలాంటి ఐకమత్యం మనలో కూడా ఉంటే ఎంత బాగుండు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories