Viral Video : వీడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే..యముడికి నేరుగా అపాయింట్‌మెంట్ అడిగేలా ఉన్నాడు

Viral Video
x

Viral Video : వీడి కాన్ఫిడెన్స్ చూస్తుంటే..యముడికి నేరుగా అపాయింట్‌మెంట్ అడిగేలా ఉన్నాడు 

Highlights

Viral Video : నేటి కాలంలో రోడ్లపై వాహనాలు నడిపే వారి కంటే స్టంట్లు చేసే వారే ఎక్కువైపోతున్నారు.

Viral Video: నేటి కాలంలో రోడ్లపై వాహనాలు నడిపే వారి కంటే స్టంట్లు చేసే వారే ఎక్కువైపోతున్నారు. సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చితో కుర్రాళ్లు బైకులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా రోడ్లపై మితిమీరిన వేగంతో వెళ్తూ పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. తాజాగా అచ్చం ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు చేసిన వెర్రి స్టంట్ వల్ల జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ స్టంట్ బాజ్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది యువకులు బైకులపై రోడ్డుపైకి వెళ్లారు. అంతా బాగానే ఉంది అనుకునే లోపే, ఒక యువకుడు తన బైక్‌ను విపరీతమైన వేగంతో నడుపుతూ కట్(జిగ్ జాగ్) కొట్టడం మొదలుపెట్టాడు. అలా స్టైల్‌గా కట్ కొట్టే క్రమంలో పక్కనే వెళ్తున్న మరో బైక్ రైడర్‌ను బలంగా ఢీకొట్టాడు. బైక్ స్పీడుగా ఉండటంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి గాల్లోకి లేచి రోడ్డుపై వెనుక బైక్ మీద ఉన్న ఇద్దరూ కుప్పకూలిపోయారు. ఆ దెబ్బకు అతను గాలిలో పల్టీలు కొడుతూ కింద పడటం చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.




అదృష్టవశాత్తూ ఆ యువకుడు రోడ్డుపై పడినప్పటికీ, వెనుక నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కింద పడిన వెంటనే అతను మళ్ళీ లేచి నిలబడ్డాడు. కానీ ఈ ఘటన చూసిన వారంతా ఆ యువకుడి నిర్లక్ష్యాన్ని తప్పుబడుతున్నారు. సొంత ప్రాణాలే కాకుండా, రోడ్డుపై వెళ్లే అమాయకుల ప్రాణాలను కూడా ఇలాంటి వారు రిస్కులో పెడుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల ఆసుపత్రి పాలవ్వడమే కాకుండా, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఈ భయంకరమైన వీడియోను ఎక్స్ వేదికగా @pki42 అనే ఐడి నుంచి షేర్ చేశారు. కేవలం 7 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. "ఇలాంటి వారికి యమధర్మరాజుతో మీటింగ్ త్వరగానే ఫిక్స్ అవుతుంది" అని ఒకరు కామెంట్ చేయగా.. "వీరు రోడ్డును గేమ్ జోన్ అనుకుంటున్నారు.. వీరి వల్ల రోడ్డుపై వెళ్లే పక్కవారికి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు?" అని మరొకరు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories