Viral Video : ఉడుకుతున్న గిన్నెలోకి దూకిన పాము..వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్

Viral Video
x

Viral Video : ఉడుకుతున్న గిన్నెలోకి దూకిన పాము..వీడియో చూస్తే ఫ్యూజులు అవుట్ 

Highlights

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

Viral Video: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం చూసేవారికి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏదో హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాలో సీన్ లాగా, ఒక సాదాసీదా వంటింట్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వంటింట్లో వంట చేసుకుంటున్న ఒక మహిళకు ఎదురైన ఈ భయంకర అనుభవం చూస్తే మీరు కూడా షాక్ అవుతారు.

ఈ వైరల్ వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక మహిళ తన కిచెన్‌లో గ్యాస్ స్టవ్ మీద ఏదో వంట చేస్తూ బిజీగా ఉంది. స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు లేదా ఆహారం ఉడుకుతోంది. ఆమె పక్కనే ఒక పెంపుడు పిల్లి కూడా ఉంది. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో, అకస్మాత్తుగా కిటికీ దగ్గర ఏదో కదలిక కనిపించింది. మరుక్షణమే ఒక భారీ పాము కిటికీలోంచి కిచెన్‌లోకి జారిపడింది. అది కూడా సరిగ్గా పొయ్యి మీద ఉడుకుతున్న గిన్నెలోనే పడటంతో ఆ మహిళ ఒక్కసారిగా గజగజ వణికిపోయింది.


ఆ పాము గిన్నెలో పడగానే పక్కనే ఉన్న పిల్లి కూడా ప్రమాదాన్ని పసిగట్టి ఒక్క ఉదుటన వెనక్కి దూకేసింది. ఆ మహిళ భయంతో గట్టిగా కేకలు వేసింది. ఏం జరుగుతుందో అర్థం కావడానికి ఆమెకు కొన్ని సెకన్లు పట్టింది. కానీ, అంతటి భయంలో కూడా ఆమె అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించింది. ఆ పాము గిన్నెలోంచి బయటకు వచ్చి మీద పడకుండా ఉండేందుకు, వెంటనే పక్కనే ఉన్న మూతను గిన్నెపై పెట్టేసింది. ఆమె చేసిన ఈ పని వల్ల ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.

ఈ షాకింగ్ వీడియోను ఎక్స్‎లో @Digital_khan01 అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. షేర్ చేసిన కొద్దిసేపటికే ఇది లక్షలాది వ్యూస్‌ను సంపాదించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాము డైరెక్ట్ గా డిష్ లోకి వెళ్ళిపోవడం ఏంటి బాబోయ్? అని ఒకరు కామెంట్ చేయగా, ఆ మహిళ ధైర్యానికి హ్యాట్సాఫ్.. ఆ సమయంలో ఎవరైనా భయపడి పారిపోతారు కానీ ఆమె మాత్రం పామును గిన్నెలోనే బంధించింది అని మరొకరు ఆమెను కొనియాడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories