Monsoon: వర్షాకాలంలో బట్టల చెడ్డ వాసన ఇలా తొలగించండి..!

How to Get Rid of Smell From Clothes in Monsoon Know These Tricks
x

Monsoon: వర్షాకాలంలో బట్టల చెడ్డ వాసన ఇలా తొలగించండి..!

Highlights

Monsoon: వర్షాకాలంలో బట్టలు ఉతకడం, ఆరేయడం మహిళలకి పెద్ద సమస్య. ఇవి సరిగ్గా ఆరిపోక చెడు వాసనని వెదజల్లుతుంటాయి.

Monsoon: వర్షాకాలంలో బట్టలు ఉతకడం, ఆరేయడం మహిళలకి పెద్ద సమస్య. ఇవి సరిగ్గా ఆరిపోక చెడు వాసనని వెదజల్లుతుంటాయి. చాలామంది చేసేదేమి లేక ఇలా చెడు వాసన వచ్చే దుస్తులనే వేసుకొని తిరుగుతుంటారు. అయితే ఇలాంటి బట్టలు వేసుకోవడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వర్షాకాలంలో దుస్తులను తాజాగా ఎలా ఉంచాలో తెలుసుకుందాం.

వర్షాకాలంలో బట్టలు సర్ఫ్‌లో నానబెట్టి ఉతకాలి. అయినప్పటికీ చెడు వాసన వస్తుంటే ఆ నీటిలో కొద్దిగా వెనిగర్ లేదా బేకింగ్ సోడాను కలపాలి. దీనివల్ల చెడు వాసన తొలగిపోతుంది. బట్టలు తాజాగా ఉంటాయి. మరొక సమస్య ఏంటంటే వర్షాకాలంలో బట్టలు సరిగ్గా ఆరవు. దీనివల్ల కూడా చెడ్డ వాసన వస్తాయి. ఈ దుర్వాసన పోవాలంటే బట్టలు ఉతుకుతున్నప్పుడు నీళ్లతో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఇది వాసనను తొలగిస్తుంది.

వర్షాకాలంలో తడి, పొడి బట్టలని ఎప్పుడు కలిపి ఉంచవద్దు. దీనివల్ల దుస్తులు దుర్వాసన వస్తాయి. వర్షాకాలంలో ఎప్పుడూ తడి బట్టలని విడిగా ఆరేయాలి. దీనివల్ల దుర్వాసన రాదు. అలాగే బట్టల తేమ కూడా త్వరగా తొలగిపోతుంది. అలాగే ఈ సీజన్‌లో ఎక్కువగా నీటిని పీల్చుకునే బట్టలు కాకుండా త్వరగా ఆరిపోయే దుస్తులు ధరిస్తే మేలు. ఇవి ఈ కాలంలో అనుకూలంగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories