కోళ్లను మింగిన భారీ కొండచిలువ.. యజమానికి తృటిలో తప్పిన ప్రమాదం

కోళ్లను మింగిన భారీ కొండచిలువ.. యజమానికి తృటిలో తప్పిన ప్రమాదం
x

కోళ్లను మింగిన భారీ కొండచిలువ.. యజమానికి తృటిలో తప్పిన ప్రమాదం

Highlights

వర్షాకాలం కావడంతో ఈ మధ్య ఎక్కడబడితే అక్కడ విష పురుగులు, పాములు బయటకు వస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్క జనాలున్న చోటకు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

వర్షాకాలం కావడంతో ఈ మధ్య ఎక్కడబడితే అక్కడ విష పురుగులు, పాములు బయటకు వస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్క జనాలున్న చోటకు వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో ఓ కొండచిలువు హల్ చేసింది. ఏకంగా కొన్ని కోళ్లను తినేసి, అక్కడే తిష్టవేసింది. అదే సమయంలో అటుగా వెళ్లిన యజమానినీ..

మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ ఆలయ పరిసర ప్రాంతంలో నాటు కోళ్ల షాప్‌లోకి ప్రవేశించిన భారీ కొండచిలువ ఆ షాపులోని కోళ్లను ఒక్కొక్కటిగా మింగేసింది. ఆ తర్వాత పొట్ట ఫుల్ అవ్వడంతో అక్కడే తిష్ట వేసింది. కోళ్ల వ్యాపారి అయిన పెద్దయాకూబ్ కోళ్ల ఫారంలోకి వచ్చి కొన్ని కోళ్లను బయటకు తీయాలని చూస్తాడు. అంతలో పక్కన ఏదో కదలడం చూసి ఒక్కసారిగా బయటకు ఉరుకుతాడు. కోళ్లను తినేసి పక్కనే ఉంది లేదంటే తనను కూడా తినేసేదే అని కోళ్ల వ్యాపారి కంగారు పడ్డాడు.

ముసలమ్మ ఆలయానికి వచ్చే భక్తులు కోళ్లను సమర్పిస్తుంటారు. అందుకే ఈ పెద్దయాకూబ్ ఇక్కడ కోళ్ల ఫామ్ పెట్టి, భక్తులకు అమ్ముతూ ఉంటాడు. కొండ చిలువ కోళ్ల పారంలో ఉన్నప్పుడు కూడా భక్తులు కోళ్లను అడగడంతో వాటిని తీసుకెళ్లడానికి వచ్చిన పెద్దయాకూబ్‌కు కొండచిలువు కనిపించింది. అయితే భయంతో వ్యాపారి బయటకు పరుగులు తీయడంతో చుట్టుపక్కలున్నవారంతా వచ్చి కొండచిలువను చూశారు. ఆ తర్వాత ఈ సమాచారాన్ని అటవీ శాఖకు అందించారు. అప్పుడు ఆ కొండచిలువను అక్కడ నుంచి తొలగించి, సమీపంలోని అడవుల్లో వదిలేశారు.

దాదాపు 5 గంటలపాటు కొండచిలువ హల్ చల్ చేయడంతో దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories