Japan Baba Vanga: మరో 2 రోజుల్లో ఏం జరగబోతుంది? జపాన్ కొత్త బాబా వంగా అంచనా నిజమౌతుందా? నగరాలు మునిగిపోతాయా?

Japan Baba Vanga
x

Japan Baba Vanga: మరో 2 రోజుల్లో ఏం జరగబోతుంది? జపాన్ కొత్త బాబా వంగా అంచనా నిజమౌతుందా? నగరాలు మునిగిపోతాయా?

Highlights

Japan Baba Vanga: జపనీయులు కొత్త బాబా వాంగాగా పేరు పొందిన రియో టాట్సు అంచనా నిజం అవబోతుందా? జులై 5, 2025న జపాన్‌లో భారీ భూకంపం, సునామీ వస్తుందని, నగరాలు నీటిలో కొట్టుకుపోతాయని రియో అంచనా వేశారు.

Japan Baba Vanga: జపనీయులు కొత్త బాబా వాంగాగా పేరు పొందిన రియో టాట్సు అంచనా నిజం అవబోతుందా? జులై 5, 2025న జపాన్‌లో భారీ భూకంపం, సునామీ వస్తుందని, నగరాలు నీటిలో కొట్టుకుపోతాయని రియో అంచనా వేశారు. దీంతో పర్యాటక రంగాలన్నీ వణికిపోతున్నాయి. అయితే రియో వేసిన అంచనాలు నిజం కాదని, భయపడాల్సింది ఏమీ లేదని జపాన్ అధికారులు చెబుతున్నారు. అసలింతకీ రియో ఏం చెప్పిందో ఇప్పుడు చూద్దాం..

బల్గేరియాకు చెందిన బాబా వాంగా మీకు గుర్తున్నారా? ఆమె ఒక ప్రపంచ ప్రసిద్ది కాలజ్నాని. ఇప్పుడు అచ్చం వాంగాలానే జపాన్‌లో రియో టూట్సుకి భవిష్యత్తులో కొన్ని భయంకరమైన సంఘటనల గురించి చెబుతుంటారు. అందుకే ఆమెను జపనీస్ వాంగా బాబా అని పిలుస్తున్నారు. అయితే రియో జులై 5, 2025 తేదీన జపాన్‌లో భారీ భూకంపం వస్తుందని. ఈ భూకంపం కారణంగా పెద్ద ఎత్తున సునామీ విరుచుకుపడి పలు నగరాలు ఆ నీటిలో కొట్టుకుపోతాయని తను రాసిన 1999 మాంగా‘ వాటాషి గ మితా మిరాయ్’లో ఉంది. ఈ జపాన్ మాంగా అంచనా ప్రకారం జులై 5న ఈ ఘోరం జరగబోతుందేమో అని జపాన్ మొత్తం ఇప్పుడు హడలిపోతుంది.

జులై 5న మొదట జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య ఉన్న పసిఫిక్ మహా సముద్రంలో నీటి అడుగున ఉన్న అగ్నిపర్వతం పేలుతుంది. ఆ తర్వాత పెద్ద ఎత్తున భూకంపం, సునామీలు వస్తాయని జపనీస్ వాగా అంచనా వేసింది. అయితే జులై 5 మరో రెండు రోజులే ఉండడంతో టూరిజం భయాందోళనలు చెందుతుంది. ఇక జపాన్ ప్రజలు ఏం జరుగుతుందో తెలియక తెగ టెన్షన్ పడుతున్నారు.

గతంలో అంటే 2011లో ఈశాన్య జపాన్ పై సునామీ విరుచుకుపడింది. అప్పుడు సంభవించిన భూకంపం, సునామీ కూడా రియో ముందుగానే అంచనా వేసి హెచ్చరించిందే. అయితే అప్పుడు భారీ భూకంపం, సునామీ ముందుగానే చెప్పారు. అది జరిగింది. కాబట్టి ఇది కూడా జరగొచ్చునేమో అని అనుమానం పడుతూ ప్రజలు భయంతో వణుకుతున్నారు.

ఇదిలా ఉంటే జపాన్ ప్రభుత్వం మాత్రం రియో మాటలను నమ్మడం లేదు. ఆమె ఊహలు చెబుతుందని, ఎటువంటి శాస్త్రీయ ఆధారాలులేవని ఇటువంటి అవాస్తవాలను నమ్మెద్దని అంటుంది. కానీ రియో చెప్పింది జరిగే పరిస్థితులు ఏంటని పర్యాటక రంగం దిగులు చెందుతుంది. ఇప్పటికీ ఈ సమయంలో జపాన్ వెళితే ప్రమాదమని చాలా మంది టూరిస్టులు వెనక్కి వెళ్లిపోయారు. దీంతో జపాన్ విమాన రిజర్వేషన్లు 83శాతం పడిపోయింది. దీంతో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. ఇక ఏటూ ఏం చేయలేక జపాన్ అధికారులు మాత్రం..తలలు పట్టుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories