Rented House: అద్దె ఇంట్లో ఉంటున్నారా.. కచ్చితం ఈ 5 హక్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి..!

Living in a Rented House Know Your Rights 5 Legal Powers That Protect Tenants
x

Rented House: అద్దె ఇంట్లో ఉంటున్నారా.. కచ్చితం ఈ 5 హక్కుల గురించి తప్పకుండా తెలుసుకోవాలి..!

Highlights

Rented House: పట్నాలకు ఉద్యోగాల కోసం, చదువుల కోసం చాలా మంది తమ సొంత ఊళ్ళను వదిలి వెళ్తుంటారు.

Rented House: పట్నాలకు ఉద్యోగాల కోసం, చదువుల కోసం చాలా మంది తమ సొంత ఊళ్ళను వదిలి వెళ్తుంటారు. అలాంటి వాళ్లందరికీ అద్దె ఇల్లు చాలా సౌకర్యంగా ఉంటుంది. చెన్నై, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద నగరాల్లో చిన్న రూమ్స్ నుంచి పెద్ద అపార్ట్‌మెంట్ల వరకు మనకు నచ్చినట్లు అద్దెకు దొరుకుతాయి. దానికి తగ్గట్టుగా అద్దె కట్టాలి. ఇల్లు ఇచ్చిన యజమాని కొన్ని షరతులు పెడతాడు. కొన్నిసార్లు అద్దె ఇంటికి ఒప్పందాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇల్లు ఇచ్చిన యజమానులకు రక్షణ. అయితే, ఇలా అద్దె ఇళ్ళలో ఉంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో, అద్దెకు ఉండే వాళ్ళకు ఎలాంటి చట్టపరమైన హక్కులు ఉన్నాయో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అద్దె ఇళ్లలో నివసించే వారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన హక్కులు, వాటి పద్ధతులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

1. మీ అనుమతి లేకుండా ఎవరూ ఇంట్లోకి రాలేరు!

ఇది చాలా మందికి తెలియని ముఖ్యమైన హక్కు.. మీరు అద్దెకు ఉంటున్న ఇంట్లోకి మీ అనుమతి లేకుండా యజమాని లోపలికి రావడం చట్ట విరుద్ధం. ఇది మీ ప్రైవసీని ఉల్లంఘించినట్లే అవుతుంది. ఒకవేళ ఆయన ఏదైనా పని మీద రావాలనుకుంటే, ముందుగా మీకు చెప్పి, మీ అనుమతి తీసుకున్న తర్వాతే రావాలి. చెప్పాపెట్టకుండా వచ్చి తలుపులు తెరుచుకొని లోపలికి రావడం తప్పు.

2. అద్దె ఒప్పందం కచ్చితంగా రిజిస్టర్ చేయాలి

మీరు ఒక ఇంటిని 11 నెలల కంటే ఎక్కువ కాలం అద్దెకు తీసుకుంటున్నట్లయితే ఆ అగ్రిమెంట్ కచ్చితంగా చట్టబద్ధంగా రిజిస్టర్ చేయించుకోవాలి. మామూలు తెల్ల కాగితంపై రాసుకున్న ఒప్పందం కోర్టులో చెల్లదు. రిజిస్టర్డ్ డీడ్‌పై రాసిన ఒప్పందమే చట్టబద్ధంగా చెల్లుతుంది. దీనివల్ల, ఒకవేళ యజమాని మిమ్మల్ని మోసం చేయాలని చూసినా మీ హక్కులు రక్షించడానికి అవకాశం ఉంటుంది.

3. మిమ్మల్ని అకస్మాత్తుగా ఖాళీ చేయించలేరు

గొడవలు వచ్చినా, అద్దె కట్టడం ఆలస్యమైనా, ఇంకేదైనా కారణం చెప్పి యజమాని మిమ్మల్ని వెంటనే ఇల్లు ఖాళీ చేయమని చెప్పలేడు. దీనికి కొన్ని చట్టపరమైన పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా, యజమాని మీకు ముందుగానే చెప్పి ఉండాలి. కనీసం 2 నెలల నోటీసు తప్పనిసరిగా ఇవ్వాలి. అకస్మాత్తుగా సామాన్లు బయట పడేయడం లాంటివి చేస్తే, అది చట్టపరమైన నేరం అవుతుంది.

4. అడ్వాన్స్ ఎంత తీసుకోవాలో ఒక పరిమితి ఉంటుంది

ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు యజమాని అడ్వాన్స్ అడుగుతాడు. కానీ, దీనికి ఒక చట్టపరమైన పరిమితి ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో అయితే, కేవలం 2 నెలల అద్దె మాత్రమే అడ్వాన్స్‌గా తీసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే 6 నుంచి 10 నెలల అడ్వాన్స్ అడగడం చట్ట విరుద్ధం. కాబట్టి, ఎవరైనా ఎక్కువ అడ్వాన్స్ అడిగితే, మీరు దానిపై ప్రశ్నించే హక్కు ఉంటుంది.

5. రసీదు అడిగే హక్కు

మీరు అద్దెను క్యాష్‌గా కట్టినా, యజమానిని అడిగితే ఆయన కచ్చితంగా రసీదు ఇవ్వాలి. ఇది మీరు అద్దె కట్టారనడానికి చట్టబద్ధమైన ఆధారం. చాలా మంది రసీదు తీసుకోవడం పట్టించుకోరు. కానీ, భవిష్యత్తులో ఏదైనా సమస్య వస్తే, మీరు అద్దె కట్టినట్లు రుజువు చేయడానికి ఈ రసీదు చాలా అవసరం. అందుకే, అద్దె కట్టిన ప్రతిసారీ రసీదు తీసుకోవడం మర్చిపోవద్దు.

Show Full Article
Print Article
Next Story
More Stories