Mars secrets: మార్స్‌పై కనిపిస్తున్న ఆ ఆకారాలు ఏంటి? ఏలియన్స్ పుర్రెలా లేక వింత జీవుల కళేబరాలా?

Mars secrets
x

Mars secrets: మార్స్‌పై కనిపిస్తున్న ఆ ఆకారాలు ఏంటి? ఏలియన్స్ పుర్రెలా లేక వింత జీవుల కళేబరాలా?

Highlights

Mars secrets: మార్స్‌పై పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలకు ఎప్పుడూ మార్స్ మిస్టరీగానే ఉంటుంది. రీసెంట్‌గా మార్స్‌పై తీసిన కొన్ని ఫోటోలలో రాళ్లు వింత ఆకారంలో కనిపిస్తున్నాయి. ఇంతకీ అవి రాళ్లా? లేక పుర్రెలా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇంకా మార్స్ పైన కనిపించిన ఆకారాలు ఎలా ఉన్నాయంటే.

Mars secrets: మార్స్‌పై పరిశోధనలు జరిపే శాస్త్రవేత్తలకు ఎప్పుడూ మార్స్ మిస్టరీగానే ఉంటుంది. రీసెంట్‌గా మార్స్‌పై తీసిన కొన్ని ఫోటోలలో రాళ్లు వింత ఆకారంలో కనిపిస్తున్నాయి. ఇంతకీ అవి రాళ్లా? లేక పుర్రెలా? అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇంకా మార్స్ పైన కనిపించిన ఆకారాలు ఎలా ఉన్నాయంటే..

మార్స్‌పై జరిగితే పరిశోధనల్లో చాలా డేటా బయటకు వస్తోంది. అయితే కొన్ని విషయాలు మాత్రం మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. అక్కడ తీసిన ఫోటోలలో కనిపించే ఆకారాలు పరిశోధకులకు చాలా అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. అలాంటి కొన్నివిషయాలను ఇప్పుడు చూద్దాం.

మార్స్ పై తీసిన ఫోటోలలో కొన్ని ఫోటోలలో వింత వింత ఆకారాలు కనిపించాయి. అయితే ఇవి రాళ్లా లేక పుర్రెలా అర్ధం కావడం లేదు. ఎందుకంటే అవి రాళ్లగానూ అలాగే పుర్రెల షేప్‌లో కనిపించడంతో పరిశోధకులు ఒక క్లారిటీకి రాలేకపోతున్నారు. ఒకవేళ అవి పుర్రెలైతే ఏలియన్స్‌కు సంబంధించిన పుర్రెలా లేక గతంలో ఎప్పుడైనా అక్కడ ఏదైనా జీవన జాతి ఉండేదా? అనే డౌట్స్ కూడా వస్తున్నాయి. అయితే ఫైనల్‌గా శాస్త్రవేత్తలు వాటన్నింటికీ ఒక నేచురల్ అక్స్ ఫ్లనేషన్ ఇచ్చారు.

మార్స్‌పై 1976లో తీసిన ఫోటోలో కొన్ని రాళ్లు కనిపిస్తాయి. అందులో ఒక చాలా స్పస్టంగా మనిషి ముఖంలా కనిపిస్తుంది. రెండు కళ్లు ముక్కు నోరు.. ఇలా చాలా స్పస్టంగా కనిపిస్తుంది. దీంతో ఎన్నో ఊహాగానాలు, కథలు ఆ ముఖంపై పుట్టుకొచ్చేసాయి. అయితే అవన్నీ నిజం కాదని, హై రిజొల్యూషన్‌లో తీయడం వల్ల ఆ రాళ్లపై లైటింగ్ పడిందని, దాని వల్లే అవి అలా కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు తేల్చేశారు.

మార్స్‌పై కనిపించిన మరొక వింత ఆకారం స్పైడర్ వెబ్ క్రాక్స్. వీటిని చూస్తే ఒక వింత ఆకారంలో ఉంటాయి. అలాగే సాలెగూడు ఆకారంలో కనిపిస్తాయి. వీటిపై కూడా చాలా ఊహాగానాలు వినిపించాయి. ఇవేవో తెలియని జీవులు చేసుకున్న వింతలంటూ పుకార్లు వచ్చాయి. అయితే సైంటిస్టులు ఆ తర్వాత ఆ క్యూరియాసిటీని విప్పేసారు. మార్టిన్ స్ప్రింగ్‌లో కార్బన్ డయాక్సైడ్ మంచు నేరుగా వాయువుగా మారడం వల్ల ఈ ప్యాట్రన్లు ఏర్పడతాయని చెప్పారు. సబ్లిమేషన్‌గా తెలిపే ఈ ప్రాసెస్‌ ఉపరితలాన్ని పగులుగొట్టడం వల్ల వింత గుర్తు ఏర్పడాయని తేల్చారు.

2024లో నాసా జీబ్రా చారలు లాంటి ఒక రాయిని కనిపెట్టింది. దీనిపేరు జీబ్రా రాక్. దీన్ని చూసిన తర్వాత కూడా చాలా ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆ తర్వాత సైంటిస్టులు.. మాగ్మా చల్లబడటం లేదా వేడికావడం వల్ల ప్రెజర్‌‌తో కూడిన ఇతర భౌగోళిక ప్రక్రియల ద్వారా ఈ చారలు ఏర్రడ్డాయని సైంటిస్టులు చెబుతున్నారు.

జెజెరో క్రేటర్‌‌లోని సర్సెవరెన్స్ పుర్రె ఆకారంలో ఉన్న ఒక రాయిని గుర్తించింది. దాని చుట్టు ఉన్న ఇతర రాళ్ల కంటే ఇది భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి అది రాయి కాదని ఏదో ఒక జీవికి చెందిన పుర్రె అనే ఊహాగానాలు బాగా వినిపించాయి. అయితే ఇది ఇలా ఎందుకున్నది ఇంకా సైంటిస్టులకు అంతుచిక్కలేదు. దానిపైన ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.

అదేవిధంగా చిన్న అడుగు సైజులో ఉన్న తలుపు ఆకారంపై కూడా కొన్ని కథలు వినిపించాయి. ఒక ఫోటోలో చుట్టు ఒక పెద్ద కొండ, కొండ మధ్యలో చిన్న తలుపులా కనిపిస్తుంటుంది. దీనిపైన కూడా పరిశోధనలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories