Viral Video: సింహంతో కోతి చెలగాటం.. ఇంతకీ వీడియో నిజమేనా బాసూ!

Viral Video: సింహంతో కోతి చెలగాటం.. ఇంతకీ వీడియో నిజమేనా బాసూ!
x
Highlights

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అ ఏ చిన్న ఆసక్తికరమైన వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది.

Viral Video: సోషల్ మీడియా పుణ్యమా అ ఏ చిన్న ఆసక్తికరమైన వీడియో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఏంటా వీడియో? అందులో అంతలా వైరల్ అయ్యేందుకు ఏముందనేది మీరే చూడండి.

ఓ కోతి కర్ర పట్టుకొని పడుకున్న సింహాన్ని కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, అదే సమయంలో సింహం అకస్మాత్తుగా మేల్కొని కోతిని వెంబడించడం మొదలు పెట్టింది. దీంతో ఆ విషయాన్ని గమనించిన కోతి కర్రను పట్టుకొని అక్కడి నుంచి పరిగెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే ఈ వీడియో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో రూపొందించినట్లు స్ఫష్టమవుతోంది.

యానిమల్స్‌ వరల్డ్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ఈ వీడియోను పోస్ట్‌ చేయగా తెగ ట్రెండ్‌ అవుతోంది. ఈ వీడియో అచ్చంగా నిజమైన వీడియోలాగా ఉండడం విశేషం. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పేందుకు ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. ఈరోజుల్లో AI ద్వారా రియలిస్టిక్ వీడియోలు సృష్టించడం సాధారణమైపోయింది.

మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ కొందరు భారీగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. ఇంత నేచురల్‌గా వీడియోలను ఏఐతో రూపొందిస్తుంటే భవిష్యత్తులో సినిమా తీసే విధానం పూర్తిగా మారిపోవడం ఖాయమనిపించడంలో ఎలాంటి సందేహం లేదు కదూ! నెట్టింట తెగ వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.


Show Full Article
Print Article
Next Story
More Stories