Naa Anveshana: ఒక్కటి పోతే బాధ పడతానా బత్తాయిలూ.. మీకు నరకం చూపిస్తా.. రెచ్చి పోయిన నా అన్వేష్

Naa Anveshana: బత్తాయిలు అంటూ మరో వీడియో వదలిన అన్వేష్.. ఇన్ స్టా బ్యాన్ పై హాట్ కామెంట్స్..
x

Naa Anveshana: బత్తాయిలు అంటూ మరో వీడియో వదలిన అన్వేష్.. ఇన్ స్టా బ్యాన్ పై హాట్ కామెంట్స్..

Highlights

Naa Anveshana: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్)కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది.

Naa Anveshana: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ (అన్వేష్)కు మెటా సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. సుమారు 1.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించింది. మతపరమైన అంశాలు, దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు చేసిన ఫిర్యాదు మేరకు మెటా ఈ చర్య తీసుకుంది. అయితే, అకౌంట్ తొలగింపుపై అన్వేష్ తనదైన శైలిలో అత్యంత ఘాటుగా స్పందించారు.

అన్వేష్ స్పందన: 'బత్తాయిలకు నరకం చూపిస్తా'

అకౌంట్ పోవడంపై తనకు ఎలాంటి బాధ లేదని చెబుతూ అన్వేష్ ఒక వీడియో విడుదల చేశారు. "నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఏంటి? పోతే ఏంటి? అది నా ఈకతో సమానం" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన అకౌంట్ పోయినందుకు ఆనందపడుతున్న వారిని 'బత్తాయిలు' అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

శరీర భాగాలతో పోలిక:

తన సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని శరీర భాగాలతో పోలుస్తూ అన్వేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "రెండు ఇన్‌స్టాగ్రామ్‌లు నా రెండు చేతులు, రెండు యూట్యూబ్ ఛానళ్లు నా రెండు కాళ్లు, ఫేస్‌బుక్ నా శరీరం. ఈ ఐదు భాగాలను నడిపించేది నా తెలివైన బుర్ర. ఒక చెయ్యి లాంటి అకౌంట్ పోతే మరో చెయ్యి ఉంది. అన్నీ పోయినా నా తలతో (తెలివితేటలతో) మాట్లాడి ముందుకు వెళ్తాను. నన్ను టార్గెట్ చేసేవారు దొరికితే డైరెక్ట్‌గా నా తల నరికేయాలి" అంటూ సంచలనం రేపారు.

నెలకు రూ. 8 లక్షల ఆదాయం:

తానెవరినీ మోసం చేయలేదని, కేవలం యూట్యూబ్ నుంచే తనకు నెలకు రూ. 8 లక్షల వరకు ఆదాయం వస్తుందని అన్వేష్ వెల్లడించారు. తనను విమర్శించే వారికి నిద్ర పట్టనివ్వనని, ఎవరినీ వదిలిపెట్టనని ఆయన ఫైర్ అయ్యారు. 2026లో విమర్శకులకు నరకం చూపిస్తానంటూ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories