New Study: వామ్మో.. ప్లాస్టిక్ కంటే గాజు నీళ్ల బాటిలే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

New Study Reveals Glass Bottles Have More Microplastics Than Plastic Bottles
x

New Study: వామ్మో.. ప్లాస్టిక్ కంటే గాజు నీళ్ల బాటిలే ప్రమాదమా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది?

Highlights

New Study: ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ప్లాస్టిక్‌కి బాయ్ బాయ్ చెప్పి.. గాజు బాటిల్‌నే ఎక్కువ వాడుతున్నారు.

New Study: ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ప్లాస్టిక్‌కి బాయ్ బాయ్ చెప్పి.. గాజు బాటిల్‌నే ఎక్కువ వాడుతున్నారు. నీళ్లు తాగడానికి, లంచ్ బాక్సులకు, కిచెన్‌లోకి కూడా ఇప్పుడు ఎక్కువమంది గాజు సీసాలకు షిఫ్ట్ అయిపోయారు. అయితే తాజాగా ఫ్రాన్స్ ఫుడ్ సేప్టీ ఏజెన్సీ (ANSES) జరిపిన సర్వేలో భయానకమైన విషయాలు బయటపడ్డాయి. ప్లాస్టిక్ బాటిల్‌లో కంటే గాజు బాటిళ్లలోనే ఎక్కువ మైక్రో ప్లాస్టిక్‌లు ఉన్నాయని తేలింది. ఈ స్టడీ ఇంకా ఏం చెప్పిందో చూద్దాం.

ప్లాస్టిక్ వాడొద్దు. ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా పర్యావరణాన్ని కూడా ప్లాస్టిక్ పాడు చేస్తుంది. ఇదే విషయం మనకు తెలుసు. ఇదేంటి ప్లాస్టిక్ బాటిల్‌లో కంటే గాజు బాటిలో ఎక్కువ మైక్రో ప్లాస్టిక్‌లు ఉండటం. ఇది ఎక్కడ విడ్డూరం అని మీరు అనుకుంటున్నారా? అయితే ఫ్రాన్స్ ఫుడ్ సేప్టీ ఏజెన్సీ (ANSES) జరిపిన స్టడీ ఏం చెబుతుందంటే..

ఫ్రాన్స్ ఆహార భద్రతా సంస్థ ANSES విడుదల చేసిన ఒక అధ్యయనం ప్రకారం, గాజు సీసాలలో ప్లాస్టిక్ బాటిళ్ల కంటే చాలా ఎక్కువ మైక్రోప్లాస్టిక్‌లు ఉన్నాయి. సగటున, కూల్ డ్రింక్స్, నిమ్మరసం, ఐస్డ్ టీ మరియు బీర్ లను గాజు సీసాలలో వేసి చూస్తే.. లీటరుకు దాదాపు 100 మైక్రోప్లాస్టిక్ కణాలు అందులో గుర్తించారు. ఇది ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లలో కంటే 50 రెట్లు ఎక్కువ కావడంతో సైంటిస్టులే అశ్చర్యపోయారు. ఈ అధ్యయనం జరుపుతున్న పరిశోధకులు మొదట్లో గాజు సీసాలే ప్లాస్టిక్ బాటిళ్ల కంటే ఆరోగ్యకరమైనవని నమ్మారు. కానీ అధ్యయనం జరిపిన తర్వాత ఎవరూ ఊహించని ఫలితాలు వచ్చాయని వారు అన్నారు.

ప్లాస్టిక్, గ్లాస్.. బాటిళ్లను తీసుకుని అందులో రకరకాల పానీయాలు వేశారు. అయితే వీటి క్యాప్‌ల వల్ల సీసాలలో ఎక్కువ మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. అదేవిధంగా బీర్ వేసిన గాజు బాటిల్‌పై జరిపిన పరిశోధనలో అన్నింటికంటే ఎక్కువ మైక్రో ప్లాస్టిక్ దీనిలో ఉన్నట్టు గుర్తించారు. దాదాపు లీటరు 60 కణాలు ఇందులో ఉన్నాయి. అంతేకాదు, నిమ్మరసం వేసిన బాటిల్‌లో 40 శాతం ఉంటే ఇతర రంగు రంగుల నీళ్లలో వేసిన బాటిళ్లలోనూ మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్టు గుర్తించారు.

ప్లాస్టిక్ సీసాలతో పోలిస్తే ప్లాస్టిక్ బాటిల్‌ లో 1.6 కణాలు ఉంటే అదే గాజు సీసాలో 4.5 కణాలు ఉన్నట్టు పరిశోధకులు నిర్ధారించారు. అయితే వైన్ వేసిన బాటిళ్లలో మైక్రో ప్లాస్టిక్‌ని పరిశోధకులు గుర్తించలేదు. దీనికి కారణం ఏంటంటే.. వైన్ బాటిల్స్ అన్నీ మెటల్ క్యాప్‌లు కలిగి ఉండటమే.

మైక్రోప్లాస్టిక్‌తో ముప్పు ఏంటి?

ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వాడితే ముప్పు ఉందని తెలిసినా దాని వాడకం ఈ మధ్య ఎక్కువై పోయింది. దీంతో దీని ఉత్పత్తి కూడా పెరిగిపోయింది. 1950లలో 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి ఉంటే.. 2022 నాటికి 400.3 మిలియన్ టన్నులకు అది పెరిగిపోయింది. మరి అయితే ఈ మధ్య కాలంలో వాడి పడేసే ప్లాస్టిక్ అంతా ఎక్కడకు వెళుతుంది. మరీ ముఖ్యంగా యూజ్ అండ్ త్రో ప్లాస్టిక్ వాడకం ఎక్కువపోయింది. మరి ఇదంతా ఎక్కడకు వెళుతుంది. అంటే.. వీటి ప్రభావం జీవరాశులపైనే కాకుండా భూమి, సముద్రాలపైన కూడా తీవ్రంగా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ వాడకం పూర్తిగా మానేస్తేనే గానీ దీనికి పరిష్కారం లేదని అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories