Viral Video: లవ్ మ్యారేజి చేసుకున్నారని... ఇద్దరినీ కాడికి కట్టి పొలం దున్నించారు!

Viral Video: లవ్ మ్యారేజి చేసుకున్నారని... ఇద్దరినీ కాడికి కట్టి పొలం దున్నించారు!
x

Viral Video: లవ్ మ్యారేజి చేసుకున్నారని... ఇద్దరినీ కాడికి కట్టి పొలం దున్నించారు!

Highlights

ఒడిశాలో ఓ అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌కాస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నదే కారణంగా ఓ యువ జంటకు గ్రామస్తులు ఇష్టానుసారంగా శిక్ష విధించారు. ఎద్దుల్లా కాడికి కట్టి పొలం దున్నించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటన రాయగఢ జిల్లా కంజమాజిర గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఒక యువకుడు, యువతి తమ కులం భిన్నంగా ఉన్నప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహం స్థానిక సామాజిక కట్టుబాట్లకు విరుద్ధమని భావించిన గ్రామస్థులు, వారిని ఎద్దుల్లా కాడికి కట్టి పొలం దున్నించేలా ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా, కొందరు వారిని కొట్టడమే కాకుండా ముల్లు కర్రలతో పొడుస్తూ ఉన్నట్లు వీడియోలో కనిపించింది.

ఈ దారుణం బయటపడిన వెంటనే ప్రజలు, నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యలు పూర్తిగా అమానుషమని, బాధ్యత వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటన ద్వారా సమాజంలో ఇంకా పాతకాలపు కులవృత్తుల మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయనేది స్పష్టమవుతోంది. ప్రేమ పెళ్లి చేసుకున్నదే ఓ నేరంగా భావించి ఇలాంటి శిక్షలు విధించటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories