Optical Illusion : 10 సెకన్లలో సాలీడును గుర్తుపట్టండి చూద్దాం?

Optical Illusion
x

Optical Illusion : 10 సెకన్లలో సాలీడును గుర్తుపట్టండి చూద్దాం?

Highlights

మీ కళ్ల పవర్‌ను పరీక్షించే ఛాలెంజ్ ఇది.. కేవలం 10 సెకన్లలో దాగి ఉన్న సాలీడును గుర్తిస్తే మీ పరిశీలన శక్తి టాప్ క్లాస్!

కంటికి సవాల్ విసిరే సరికొత్త ఛాలెంజ్‌తో మళ్లీ మీ ముందుకు వచ్చేశా.. ఈ కొత్త ఛాలెంజ్ మీ చూపును, తెలివితేటలను పరీక్షించడానికి రెడీగా ఉంది. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటో తెలుసా.. పైన ఇచ్చిన చిత్రాన్ని ఒకసారి సరిగ్గా గమనించండి. ఇప్పుడు ఛాలెంజ్ ఏంటో చెబుతా చూసేయండి.. పైన ఇచ్చిన ఫోటోలో ఒక సాలీడు ఉంది, దానిని కనిపెట్టడమే ఈరోజు మీ టాస్క్. నిజానికి చాలామంది ఈ సాలీడును 10 సెకన్లలో గుర్తించలేక చేతులెత్తేశారు. ఎందుకంటే ఈ చిత్రంలో రంగులు, కాంట్రాస్ట్ అలా కలిపిపోయి ఉంటాయి కాబట్టి. మీ కళ్లు చాలా షార్ప్ అని నమ్మితే సరదాగా ట్రై చేయండి. మీరు ఎన్ని సెకన్లలో దానిని కనిపెడతారో చూద్దాం. వాస్తవానికి ఆప్టికల్ ఇల్యూజన్లను స్వాల్ చేయడం ద్వారా మీ ఏకాగ్రతను పెంచుకోవడమే కాకుండా, చిన్న చిన్న విషయాలను కూడా లోతుగా గమనించే సామర్థ్యాన్ని మెరుగుపరుచుకున్నట్లు అవుతుంది.

ఛాలెంజ్ ప్రకారం మీరు 10 సెకన్లలో కనిపెట్టాలి. ఒకవేళ మీరు ఇంకా కనిపెట్టలేకపోయరా.. మరేం పర్వాలేదు.. సమాధానాన్ని సర్కిల్ చేసి ఇచ్చాం చూడండి. నిజానికి ఆ సాలీడు పైన ఇచ్చిన చిత్రంలో మన కళ్ల ముందే ఉంది. కానీ మనం దాన్ని గుర్తుపట్టలేం. అసలు పైన ఇచ్చిన చిత్రంలో ఆ సాలీడు ఎక్కడ ఉందో తెలుసా.. ఆ ఫోటో ఉన్న అమ్మాయి వేసుకున్న షూ మీద ఉంది. చాలా జాగ్రత్తగా గమనిస్తే తప్ప అక్కడ సాలీడు ఉందనేది అర్థం కాదు. ఈ పజిల్ మీకు నచ్చిందా.. అయితే ఫ్రెండ్స్‌కు కూడా షేర్ చేయండి.





Show Full Article
Print Article
Next Story
More Stories