
Optical Illusion: ఈ పుస్తకాల రాక్‌లో.. ఆ 3 వస్తువులను కనిపెట్టండి!
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇవి కేవలం ఫోటోలు మాత్రమే కాదు, మన మెదడుకు, కళ్ల మధ్య జరిగే ఒక చిన్నపాటి యుద్ధానికి కారణం అవుతుంటాయి.
Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్స్ ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. ఇవి కేవలం ఫోటోలు మాత్రమే కాదు, మన మెదడుకు, కళ్ల మధ్య జరిగే ఒక చిన్నపాటి యుద్ధానికి కారణం అవుతుంటాయి. పైన ఉన్న ఫోటోలో కనిపిస్తున్న పుస్తకాల రాక్‌లో రంగురంగుల పుస్తకాలు చక్కగా అమర్చి ఉన్నాయి. కానీ, ఆ పుస్తకాల మధ్య మూడు వస్తువులు చాలా చాకచక్యంగా దాగి ఉన్నాయి. అవేంటంటే.. ఒక పక్షి, ఒక జత కళ్లద్దాలు , ఒక తాళం చెవి.. ఈ రోజు మీ ఛాలెంజ్ ఏంటంటే.. ఈ 3 వస్తువులను గుర్తించడం. నిజానికి చాలా మంది వారి మొదటి చూపులో వీటిని గుర్తించలేరు. మీరు గుర్తించగలరో చూడండి.
మీరు ఇంకా ఆ వస్తువులను వెతుకుతూ ఉంటే, ఈ చిన్న క్లూస్ మీకు సహాయపడవచ్చు. పక్షి ఎగురుతూ ఉండకపోవచ్చు, కానీ ఎక్కడో పుస్తకాల మధ్య నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. అలాగే కళ్లద్దాలు ఎవరో చదువుతూ మర్చిపోయినట్లుగా ఒక పుస్తకం మీద ఉన్నాయి. తాళం చెవి పుస్తకాల అంచుల రంగులతో కలిసిపోయి ఉండవచ్చు.. సరిగ్గా గమనిస్తే మీకు కనిపిస్తుంది.. చూడండి ఒకసారి మంచిగా. కచ్చితంగా కనిపిస్తాయి. నిజానికి ఇలాంటి పజిల్స్ పూర్తి చేయడం వల్ల మనకు కొన్ని గొప్ప ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. వీటితో చిన్న చిన్న వివరాలను కూడా గమనించేలా మన మెదడుకు శిక్షణ లభిస్తుందని, విజువల్ మెమరీ పదును దేలుతుందని చెబుతున్నారు. మీరు ఆ మూడింటిని కనిపెట్టగలిగితే.. కంగ్రాట్స్. మీకు అద్భుతమైన పరిశీలన శక్తి ఉంది. ఇంకా వెతుకుతూ ఉంటే కంగారు పడకండి, ప్రాక్టీస్ చేసే కొద్దీ మీ మెదడు మరింత చురుగ్గా మారుతుంది. మీకు ఈ పజిల్ నచ్చితే స్నేహితులకు పంపి, వారు ఎంత వేగంగా కనిపెట్టగలరో చూడండి!

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




