Optical Illusion: ఈ పిల్లుల గుంపులో కుందేలు ఎక్కడుందో కనిపెట్టగలరా?

Optical Illusion
x

Optical Illusion: ఈ పిల్లుల గుంపులో కుందేలు ఎక్కడుందో కనిపెట్టగలరా? 

Highlights

Optical illusion: మీ కంటి చూపు ఎంత పదునుగా ఉందో పరీక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 'ఆప్టికల్ ఇల్యూషన్' పజిల్ మీకోసమే.

Optical illusion: మీ కంటి చూపు ఎంత పదునుగా ఉందో పరీక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ 'ఆప్టికల్ ఇల్యూషన్' పజిల్ మీకోసమే. సాధారణంగా మన కళ్ళు చూసేదానికి, మెదడు అర్థం చేసుకునే దానికి మధ్య ఉండే చిన్న తేడానే 'ఆప్టికల్ ఇల్యూషన్' అంటారు. తాజాగా ఒక ఫోటో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఇబ్బంది పెడుతోంది. పైన ఇచ్చిన చిత్రం అదే. ఈ చిత్రంలో తెలుపు, నారింజ, బూడిద రంగుల్లో ఉండే వందలాది కార్టూన్ పిల్లులు కనిపిస్తాయి కదా.. ఇవన్నీ ఒకదానికొకటి అంటుకుని ఉండి, చూడటానికి ఒక పిల్లుల సముద్రాన్ని తలపిస్తున్నాయి. కొన్ని పిల్లులు టోపీలు పెట్టుకుని, కొన్ని బో-టైలతో చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. కానీ, వీటి మధ్యలోనే ఒక అందమైన కుందేలు దాగి ఉంది.

మీ ఛాలెంజ్ ఏంటంటే..

చాలా మంది ఈ పజిల్‌ను చూసి కుందేలు ఎక్కడుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే, దీనిని అద్భుతమైన పరిశీలనా శక్తి ఉన్నవారు మాత్రమే స్వాల్ చేయగలరు. అది కూడా కేవలం 10 సెకన్లలోపే ఈ ఛాలెంజ్‌ను కంప్లీట్ చేస్తారు.కుందేలు రంగు కూడా పిల్లుల రంగుతో కలిసిపోవడం వల్ల దీనిని కనిపెట్టడం కొంచెం కష్టమైన పని. మీరు ఇంకా వెతుకుతూనే ఉన్నారా? అయితే మీకోసం ఒక చిన్న హింట్ ఇస్తున్న చూడండి.. పైన ఇచ్చిన చిత్రానికి లెఫ్ట్ సైడ్ పైభాగంలో జాగ్రత్తగా గమనించండి. ఇంకా కనిపించలేదా.. అక్కడ గమనిస్తే మీకు పిల్లుల చెవుల మధ్యలో కుందేలు పొడవాటి చెవులు కనిపిస్తాయి.





Show Full Article
Print Article
Next Story
More Stories