Viral Video: ప్రాణాల మీదికి తెచ్చిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. షాకింగ్ వీడియో..!

Viral Video: ప్రాణాల మీదికి తెచ్చిన ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. షాకింగ్ వీడియో..!
x
Highlights

Viral Video: ప్రస్తుతం పెళ్లి వేడుకలకు అర్థం మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌తో సినిమాలను తలదన్నేలా జరుగుతున్నాయి.

Viral Video: ప్రస్తుతం పెళ్లి వేడుకలకు అర్థం మారిపోయింది. మరీ ముఖ్యంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్స్‌తో సినిమాలను తలదన్నేలా జరుగుతున్నాయి. పెళ్లి వేడుకను కూడా ఒక అందమైన సన్నివేశాలుగా తీర్చిదిద్దుతున్నారు. వధూవరుల ఎంట్రీ దగ్గర నుంచి ప్రీవెడ్డింగ్ షూట్ వరకు ప్రతీ అంశాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లో కొత్తదనం కోసం కొందరు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.

కొన్ని సందర్భాల్లో వినూత్న ప్రయత్నాలు చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ పెళ్లి ఫోటోషూట్‌లో జరిగిన షాకింగ్ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ వీడియోలో, వధూవరుల ఫోటోషూట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. సినీమాటిక్ లుక్ కోసం కెమెరామెన్ ప్లాన్ ప్రకారం, వరుడు వధువును పైకి ఎత్తుకునే సమయంలో వెనుకల కలర్‌ బాంబ్స్‌ పేలి రంగులు బయటకు వస్తాయి.

అయితే పేలుడు ఎక్కువ మొత్తంలో ఉండడంతో నిప్పు రవ్వలు వధువుపై పడ్డాయి. ఒక్కసారిగా షాక్‌కు గురైన వధువు జుట్టు చూసుకోగా నిప్పు అంటుకుంది. అలాగే వీపు భాగంలో కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో వేడుకలో పాల్గొన్న వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది. పెళ్లి వేడుక అనేది ఎప్పటికీ గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం కావాలి కానీ ఇలా చేదు జ్ఞాపకాలను మిగిలించకూడదంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories