
తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విశాల ఆలయప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా మహా వైభవంగా జరుగుతున్న ఆరవ బ్రహ్మోత్సవాల తుది మంగళఘట్టమైన చక్రస్నానం వేద ఘోషలమధ్య అత్యద్భుతంగా సాగింది.
హైదరాబాద్: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విశాల ఆలయప్రాంగణంలో గత తొమ్మిది రోజులుగా మహా వైభవంగా జరుగుతున్న ఆరవ బ్రహ్మోత్సవాల తుది మంగళఘట్టమైన చక్రస్నానం వేద ఘోషలమధ్య అత్యద్భుతంగా సాగింది.
గత తొమ్మిదిరోజులుగా వివిధ వాహనాలతో మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగింపుగా సాగడం.. వెనుకనే భక్త జనసంద్రం పోటెత్తడం భాగ్యనగర చరిత్రలో ఊహాతీత భక్తిఘట్టంగా చెప్పక తప్పదు.

జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ముద్దాడ రవిచంద్ర ఆదేశం మేరకు, టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజ గోపాల నాయుడు ప్రత్యక్ష పర్యవేక్షణలో.. హైదరాబాద్ టీటీడీ ఏఈఓ రమేష్, హైదరాబాద్ జూబిలీహిల్స్ టీటీడీ టెంపుల్ ఇంచార్జి నిరంజన్ ఈ ఉత్సవాలను నిర్వహించన తీరు జంటనగరాల చరిత్రలో హైలైట్‌గా నిలిచింది.
ఈసారి మాజీ మంత్రి, కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్, బీఎస్‌సిపీఎల్ ఇన్ఫ్రా గ్రూప్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య సమర్పించిన శ్రీ మాలిక నాలుగు వందల పేజీల గ్రంధం వందలకొలది భక్తులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ఈ ఉత్సవాల శోభతో హైలైట్‌గా నిలవడం విశేషం. ఉత్సవాల ప్రారంభానికి ముందే బొల్లినేని కృష్ణయ్య ఈ మహా గ్రంధం శ్రీమాలిక వేల ప్రతులను టెంపుల్ ఇంచార్జికి అర్చకుల సమక్షంలో అందివ్వడంతో.. ఏఈవో రమేష్ పర్యవేక్షణలో ఈ చక్కని గ్రంధాన్ని ఉత్సవ నిర్వహణలో ఉపకరించిన దాతలకు, పారిశ్రామిక వేత్తలకు, వీఐపీ దర్శనాల్లో పాల్గొన్న మంత్రులకు, ప్రముఖులకు టెంపుల్ ఇంచార్జి నిరంజన్ ప్రసాదంతో పాటు ఆశీర్వచన మంటపంలో అందివ్వడం ఈసారి బ్రహ్మోత్సవాల్లో వైభవంగానే చెప్పాలని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి.
మరీ ముఖ్యంగా ఈసారి బ్రహ్మోత్సవాల్లో శ్రీమాలిక పరమాద్భుత గ్రంధాన్ని శోభాయమాన శ్రీ నరసింహస్వామి అందాలతో పవిత్రీకరించి.. మొత్తం బ్రహ్మోత్సవాలకే తలమానికంగా నిలిచేలా అందించి ఎంతోమంది ప్రశంసలు పొందిన శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ఉదయ సాయంకాల వేళల్లో పాల్గొని తన్మయించడం అక్కడి వందల కొలది భక్తులను ఎంతో ఆకర్షించింది. శ్రీనివాస్‌తో ఎంతోమంది భక్తులు సెల్ఫీలు దిగడం మీడియా కంటపడింది. ఎన్నో జన్మల పుణ్యఫలమే ఈ మహద్భాగ్యమని పురాణపండ శ్రీనివాస్ ఈ సందర్భంగా టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలపడం అభినందనీయం.
జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ చైర్మన్ ఏ.వి రెడ్డి ప్రతీరోజు మాడవీధుల ఉభయ సంధ్యలులో వాహన సేవల ఉత్సవాలను పర్యవేక్షించారు. తిరుమల నుండి వచ్చిన వేద పండితులు వైఖానస ఆగమోక్తంగా వైదిక విధులను నిర్వర్తించారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చక్రస్నానంలో పాల్గొన్నారు. ఈ చక్రస్నాన మహోత్సవం తిరుమల ఉత్సవాన్ని తలపించిందని వేల వేల భక్తులు సంతోషంతో పొంగిపోవడం సత్యమేకదా అని ఆలయ అర్చకులు శృతికలిపారు.
సాయంకాలం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ప్రసన్న గంభీర ధ్వనుల వేద ఘోషల మధ్య ధ్వజ అవరోహణ కార్యక్రమం జరిగింది. వందల కొలది భక్తుల గోవిందనామాల మధ్య హైదరాబాద్ టీటీడీ ఆలయాల ఏ ఈ ఓ రమేష్, ఇంచార్జీ నిరంజన్, టీటీడీ జూబిలీహిల్స్ చైర్మన్ ఏ. వి. రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



