Viral Video : యముడి కళ్లముందు నుంచి జస్ట్ మిస్సయ్యారు అంతే..రీల్స్ పిచ్చితో వీళ్లు చేసిన పనికి నెటిజన్లు షాక్

Viral Video : యముడి కళ్లముందు నుంచి జస్ట్ మిస్సయ్యారు అంతే..రీల్స్ పిచ్చితో వీళ్లు చేసిన పనికి నెటిజన్లు షాక్
x
Highlights

యముడి కళ్లముందు నుంచి జస్ట్ మిస్సయ్యారు అంతే..రీల్స్ పిచ్చితో వీళ్లు చేసిన పనికి నెటిజన్లు షాక్

Viral Video : రీల్స్ పిచ్చి ముదిరి పాకాన పడింది. వ్యూస్, లైక్స్ కోసం ఈ కాలం యువత ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. ఒక చిన్న వీడియో వైరల్ అయితే చాలు.. రాత్రికి రాత్రే స్టార్లు అయిపోవచ్చనే భ్రమలో ప్రమాదకరమైన విన్యాసాలకు పాల్పడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక వీడియో చూస్తుంటే, యువత ఎంతలా బరితెగిస్తున్నారో అర్థమవుతోంది. ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ యువకుల నిర్వాకం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోలో కొందరు యువకులు ఒక భారీ కాన్వాయ్‌తో కలిసి వెళ్తున్న థార్ జీపు బోనెట్‌పై నిలబడి రీల్స్ చేస్తున్నారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా నలుగురు యువకులు ఆ కారు ముందు భాగంలో నిలబడి ప్రమాదకరంగా స్టంట్లు చేస్తున్నారు. కారు వేగంగా వెళ్తుంటే, వీరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా కెమెరా వైపు చూస్తూ ఫోజులిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతూ వారు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

సరిగ్గా అప్పుడే అసలు ట్విస్ట్ మొదలైంది. జీపు వేగంగా దూసుకుపోతుండగా, అకస్మాత్తుగా ఎదురుగా ఒక ట్రాక్టర్ వచ్చింది. దీంతో థార్ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. అంతే.. వేగంగా వెళ్తున్న కారు సడన్‌గా ఆగడంతో, బోనెట్‌పై ఉన్న నలుగురు యువకులు బ్యాలెన్స్ తప్పి గాలిలోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఒకరిపై ఒకరు పడి రోడ్డు మీద దొర్లారు. చూస్తుండగానే అంతా జరిగిపోయింది. కొద్దిసేపటి వరకు ఫోజులిచ్చిన ఆ యువకులు, క్షణాల్లో నేలపాలై నవ్వులపాలయ్యారు.

నిజానికి ఇది చాలా పెద్ద ప్రమాదం. ఆ యువకులు కింద పడ్డప్పుడు వెనుక నుంచి ఏదైనా వాహనం వస్తున్నా.. లేదా వారు కారు టైర్ల కింద పడినా ఊహించని ఘోరం జరిగిపోయేది. కానీ, అదృష్టం బాగుండి ఆ సమయంలో వెనుక నుంచి ఏ వాహనం రాకపోవడంతో వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. కింద పడ్డ యువకులు వెంటనే లేచి ఏమీ జరగనట్టు సర్దుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు యువకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "లైక్స్ కోసం ప్రాణాలు పణంగా పెడతారా?" అంటూ మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories