Refrigerator: రిఫ్రిజిరేటర్ చుట్టూ ఇవి ఉంటే పేలిపోవడం ఖాయం..


Refrigerator: రిఫ్రిజిరేటర్ చుట్టూ ఇవి ఉంటే పేలిపోవడం ఖాయం..
Refrigerator: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది.
Refrigerator: ఈ ఆధునిక యుగంలో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ తప్పనిసరిగా ఉంటుంది. ఇది మన ఆహార పదార్థాలను చల్లగా ఉంచి, ఎక్కువ రోజులు చెడిపోకుండా కాపాడుతుంది. సమ్మర్ సీజన్‌లో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు. పాలు, కూరగాయలు, పండ్లు, పానీయాలు, మాంసం వంటి పదార్థాలు వేడి వాతావరణంలో త్వరగా పాడవుతాయి. వాటిని ఫ్రిజ్‌లో ఉంచితే అవి చెడిపోకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. అయితే, చాలా మంది వంటగదిలో రిఫ్రిజిరేటర్ చుట్టూ అనేక వస్తువులను ఉంచుతారు. కానీ, ఈ వస్తువులు రిఫ్రిజిరేటర్‌కు హాని కలిగిస్తాయి. అంతేకాకుండా, రిఫ్రిజిరేటర్ పేలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ వస్తువులను ఎప్పుడూ రిఫ్రిజిరేటర్ దగ్గర ఉంచకండి..
మైక్రోవేవ్ ఓవెన్
చాలా మంది వంటగదిలో రిఫ్రిజిరేటర్ దగ్గర మైక్రోవేవ్ ఓవెన్ ఉంచుతారు. అయితే, ఇలా ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే, మైక్రోవేవ్ వాడేటప్పుడు అది వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి కారణంగా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల చల్లగా ఉండాల్సిన రిఫ్రిజిరేటర్ అసాధారణంగా వేడిగా మారుతుంది.
గ్యాస్ స్టవ్
కొంతమంది వంటగదిలో స్థలం లేకుంటే రిఫ్రిజిరేటర్‌ను గ్యాస్ పక్కనే ఉంచుతారు. వంట కోసం పదే పదే గ్యాస్ ఉపయోగించడం వల్ల దాని పక్కన్నే ఉన్న రిఫ్రిజిరేటర్ పైభాగం వేడెక్కుతుంది. దీని కారణంగా రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ ఓవర్ టైం పనిచేయాల్సి వస్తుంది.
ప్లాస్టిక్ డబ్బాలు
ప్లాస్టిక్ డబ్బాలను రిఫ్రిజిరేటర్ పక్కన లేదా పైన ఉంచకూడదు. ఇవి రిఫ్రిజిరేటర్ వెంటిలేషన్‌ను నిరోధిస్తాయి. దీని వల్ల రిఫ్రిజిరేటర్ వేడెక్కడం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా సరిగ్గా పనిచేయకుండా ఉంటుంది.కాబట్టి, రిఫ్రిజిరేటర్ పక్కన లేదా పైన ప్లాస్టిక్ డబ్బాలు ఉంచకండి. ముఖ్యంగా, రిఫ్రిజిరేటర్ వెనుక వైపు ఎటువంటి వస్తువులు లేకుండా చేసుకోండి.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు
చాలా మంది రిఫ్రిజిరేటర్ చుట్టూ లేదా పైన ఎక్స్‌టెన్షన్ బోర్డును ఏర్పాటు చేసుకుంటారు. అయితే, రిఫ్రిజిరేటర్ అధిక వోల్టేజ్ కారణంగా ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, రిఫ్రిజిరేటర్ చుట్టూ లేదా పైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు ఉంచకండి.
చెత్తబుట్ట
రిఫ్రిజిరేటర్ దగ్గర చెత్తబుట్ట ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే దాని నుంచి వచ్చే దుర్వాసన, తేమ, బ్యాక్టీరియా రిఫ్రిజిరేటర్‌లోకి ప్రవేశించి ఆహారాన్ని కలుషితం చేస్తాయి. అంతేకాకుండా, రిఫ్రిజిరేటర్ దగ్గర చెత్తబుట్ట ఉండటం వల్ల మురికి, తేమతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది.
- refrigerator explosion
- fridge safety tips
- kitchen fire hazards
- home appliance danger
- refrigerator placement
- fridge ventilation issues
- fire risk appliances
- electrical short circuit
- fridge back clearance
- home safety tips
- appliance overheating
- what not to keep near fridge
- fridge safety mistakes
- refrigerator fire causes
- fridge blast warning

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire