Viral Video : కుక్కతో క్రూరమైన ఆటలు..నోరు లేని జీవిని హింసిస్తారా అంటూ నెటిజన్ల ఫైర్

Viral Video : కుక్కతో క్రూరమైన ఆటలు..నోరు లేని జీవిని హింసిస్తారా అంటూ నెటిజన్ల ఫైర్
x
Highlights

కుక్కతో క్రూరమైన ఆటలు..నోరు లేని జీవిని హింసిస్తారా అంటూ నెటిజన్ల ఫైర్

Viral Video : ప్రకృతిలో మనిషితో పాటు జీవించే హక్కు నోరు లేని మూగజీవాలకు కూడా ఉంది. కానీ కొంతమంది వికృత చేష్టల వల్ల ఆ మూగజీవాలు నరకం చూస్తున్నాయి. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, కాసేపు వినోదం కోసం జంతువులను హింసించడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. తాజాగా ఇద్దరు యువకులు ఒక కుక్కను ఆటబొమ్మలా భావించి వేధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోరు లేని జీవాలను వేధించవద్దని పెద్దలు చెబుతుంటారు. కానీ కొందరు కుర్రాళ్లకు ఇవేవీ పట్టవు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు ఒక ట్రాంపోలిన్ పై ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, వారి మధ్యలో ఒక కుక్క చిక్కుకుపోయింది. ఆ యువకులు ఒక్కో జంప్ చేస్తున్నప్పుడల్లా ఆ కుక్క కూడా గాలిలోకి అదుపు లేకుండా ఎగురుతోంది. అది అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా, ఆ కుర్రాళ్లు దానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మరింత వేగంగా ఎగురుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు.

ఆ వీడియో చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే.. ఆ కుక్క భయంతో వణికిపోతోంది. యువకులు ఎగిరిన ప్రతిసారీ అది అదుపు తప్పి పడిపోతోంది. పొరపాటున ఆ యువకుల కాళ్లు కుక్క మీద పడి ఉంటే, దాని ఎముకలు విరిగిపోయేవి లేదా ప్రాణాలే పోయేవి. ఆ కుక్కను బయటకు వదలాల్సింది పోయి, వారు చేస్తున్న పనిని కెమెరాలో రికార్డ్ చేసుకుంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఆ నోరు లేని జీవి పడుతున్న వేదన వారికి ఒక కామెడీ లాగా అనిపించడం విచారకరం.

ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, నిమిషాల్లోనే ఇది వైరల్ అయ్యింది. లక్షకు పైగా వ్యూస్ సాధించిన ఈ వీడియో కింద కామెంట్లలో జనం తిట్టిపోస్తున్నారు. మనిషి జంతువు కంటే హీనంగా తయారయ్యాడు అని ఒకరు కామెంట్ చేయగా, పాపం ఆ కుక్క తప్పుడు మనుషుల మధ్య చిక్కుకుంది అని మరొకరు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరైతే ఈ యువకులపై జంతు హింస కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం లైకుల కోసం ఇలాంటి పనులు చేయడం సభ్య సమాజానికి మంచిది కాదని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories