Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా? సూతక కాలం ఎప్పుడు?

Solar Eclipse 2025
x

Solar Eclipse 2025: సూర్యగ్రహణం ఎప్పుడు? భారత్‌లో కనిపిస్తుందా? సూతక కాలం ఎప్పుడు?

Highlights

Solar Eclipse 2025 Date: మార్చి 29 రేపు శనివారం సూర్యగ్రహణం సంభవించనుంది. మనదేవంలో సూర్యగ్రహణం కనిపించనుందా? సూతక కాలం ఎప్పుడు? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..

Solar Eclipse 2025 Date: హిందూ పురాణాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతాయి. అయితే మార్చి 29 శనివారం సూర్యగ్రహణం సంభవించనుంది. ఈరోజే శని అమావాస్య కూడా. ఆ మరుసటి రోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. అంతేకాదు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ నిర్వహిస్తారు. అయితే మార్చి 29న సూర్యగ్రహణం మన భారత దేశంలో కనిపించనుందా? సూతక కాలం ఎప్పుడు? అపూర్తి వివరాలు తెలుసుకుందాం..

సూర్యగ్రహణం అంటే భూమి, సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూమిలో కొంత భాగాన్ని లేదా మొత్తం భూమిని అడ్డుగా చంద్రుడు రావడాన్ని పాక్షిక లేదా సంపూర్ణ సూర్యగ్రహణం అంటారు.

రేపు సూర్యగ్రహణంతో పాటు శని కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నేపథ్యంలో కొన్ని అరుదైన యోగాలు సంభవిస్తున్నాయి. అంతేకాదు ఆ మరుసటి రోజు నుంచి చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈసారి కేవలం పాక్షిక సూర్యగ్రహణం మాత్రమే చోటుచేసుకోనుంది. అయితే ప్రధానంగా భారత దేశంలో సూర్యగ్రహణం ఈసారి కనిపించదు. సూర్యగ్రహణ సమయం మాత్రం మధ్యాహ్నం 2:21 నిమిషాల నుంచి సాయంత్రం 6: 14 గంటల వరకు జరగనుంది. అంటే మొత్తంగా 3: 53 గంటలపాటు ఉంటుంది.

మన దేశంలో సూర్యగ్రహణ ప్రభావం ఈసారి ఉండదు.. కాబట్టి సూతకం చెల్లదు. అయితే, ఈ ప్రపంచానికి మొత్తం సూర్యచంద్రులు ఒక్కటే కాబట్టి కొంతమంది నియమాలను పాటిస్తారు. ప్రధానంగా ఈ సూర్యగ్రహణం దక్షిణ అమెరికా, ఉత్తర, అమెరికా, యూరప్, ఆర్కిటెక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం వంటి ప్రదేశాల్లో కనిపించనుంది.

సూర్యగ్రహణం తర్వాత చేయాల్సిన పనులు..

ప్రధానంగా సూర్యగ్రహణం వీడిన వెంటనే స్నానం ఆచరించాలి.

♦ గ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా చూడకూడదు.

♦ ఈ సమయంలో బయటకు వెళ్లకుండా మానుకోవాలి.

♦ గర్భిణీలు ఇంట్లోనే ఉండాలని చెడుతారు.

♦ అంతేకాదు గ్రహణం తర్వాత ఆంజనేయ స్వామి పూజలు నిర్వహిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories