Scorpian Fish: ఊసరివల్లిలా మారే చేప..అదును చూసి ఎటాక్..సముద్రంలో డైవింగ్‌కి వెళ్లేవారు జర భద్రం

Scorpian Fish: ఊసరివల్లిలా మారే చేప..అదును చూసి ఎటాక్..సముద్రంలో డైవింగ్‌కి వెళ్లేవారు జర భద్రం
x
Highlights

Scorpian Fish: సముద్రం.. ఒక ఆశ్చర్యకరమైన ప్రపంచం. ఇక్కడుండే లక్షల రకాల జీవరాశులు ఎప్పుడూ అందరకీ ఆశ్చర్యానే కలిగిస్తాయి.

Scorpian Fish: సముద్రం.. ఒక ఆశ్చర్యకరమైన ప్రపంచం. ఇక్కడుండే లక్షల రకాల జీవరాశులు ఎప్పుడూ అందరకీ ఆశ్చర్యానే కలిగిస్తాయి. నిజంగా సముద్రం ఒక అంతుచిక్కని ప్రపంచాన్నే తనలో దాచుకుని ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు మనకు కొన్ని విషయాలు తెలిస్తే అవి విచిత్రంగానే ఉంటాయి. అలాంటిదే ఒకటి ఈ చేప. ఇది తేలులాంటి దేహాన్ని కలిగి ఉంటుంది. ఊసరవల్లిలా రంగులు మార్చుకుంటుంది. అదును చూసి శత్రువుని ఎటాక్ చేస్తుంది. ఈ చేప గురించి మీకు తెలుసుకోవాలని ఉందా?

సముద్రంలోపలకి వెళ్లేకొద్దీ ఎన్నో చిత్రవిచిత్ర జీవాలు మనకు కనిపిస్తుంటాయి. సముద్రపు అడుగుభాగంలో లక్షల చేపల రకాలు ఉంటాయి. వీటి గురించి తెలుసుకోవడం అంటే భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అలాంటి ఒక చేప ఇది. దీని రంగు గురించి చెప్పాలంటే ఇది ఒక రంగులో ఉండదు. అది ఉన్న ప్రదేశాన్ని బట్టి రంగును మార్చేసుకుంటుంది. దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే దీని వెన్నులో విషం ఉంటుంది. ఒకవేళ తెలియక దాన్ని ముట్టుకున్నామా ఇక అంతే సంగతులు.

తేలులాంటి ఆకారం.. ఊసరివల్లిలా రంగులు మార్చడం.. నాగుపాము కంటే విషపూరితం.. ఈ చేప స్పెషల్. ఇంతకీ ఈ చేప పేరు ఏంటో మీకు చెప్పలేదు కదూ. దాని పేరు స్కార్పియన్ ఫిష్. ఇది సముద్రపు అడుగు భాగంలో జీవిస్తుంది. రాళ్లలో ఉండే రాళ్ల ఆకారంలోకి... నాచులో ఉంటే నాచు ఆకారంలోకి ఇది ఈజీగా మారిపోతుంది. సముద్రంలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో ఇది ఒకటి. ఒకవేళ అది రాయి ఏమోనని ముట్టుకున్నారో ఇక అంతే సంగతులు వెంటనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

స్కార్పియన్ చేపలు వాటి రక్షణ కోసం ఇలా రంగులు మార్చేసుకుంటాయి. డైవింగ్ చేయడానికి సముద్రంలోపలకి వెళ్లేవారిని మబ్బి పెట్టడానికి, పెద్ద పెద్ద చేపల నుండి కాపాడుకోవడం కోసం ఇవి ఇలా రంగులు మార్చేసుకుంటూ ఉంటాయి. ఈ చేపలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. గుంపులు గుంపులుగా ఇవి తిరుగుతుంటాయి. ఇది చూడడానికి చాలా చిన్నదే. కానీ దీనిలోని విషం మాత్రం చాలా పవర్ ఫుల్. దీని వెన్నులో ఉన్న ముళ్లు విషాన్ని చిమ్ముతాయి. ఈ విషం ఎప్పుడే శరీరానికి తగిలిందో అప్పుడు నొప్పి, వాపుతో పాటు శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. అందుకే డైవింగ్‌కు వెళ్లేవారు జర భద్రంగా ఉండాలి. రాళ్లపైన. ఇసుకలో చెయ్యి పెట్టే ముందు ఒక సారి ఆలోచించాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.

Show Full Article
Print Article
Next Story
More Stories