Ugadi 2025: ఉగాది రోజు ఎలాంటి పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు..

Ugadi 2025
x

Ugadi 2025: ఉగాది రోజు ఎలాంటి పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు..

Highlights

Ugadi Must Do Things: మార్చి 30 ఆదివారం ఉగాది పండుగ రానుంది. ఈరోజు శ్రీ విశ్వవసు సంవత్సరం ప్రారంభం అవుతుంది. అంటే చైత్రమాసం మొదటి రోజే శుక్లపక్షం, పాడ్యమి రోజున ఈ సంవత్సరం పండగ రానుంది. అయితే తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉగాది కొత్త సంవత్సరం.. తెలుగు ప్రజలంతా ఈరోజు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. పంచాంగ శ్రవణం గుళ్లలో నిర్వహిస్తారు.

Ugadi Must Do Things: ఉగాది పండుగ ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఈ పండుగ వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగ రోజు కొన్ని పనులు కచ్చితంగా చేయాలి. అయితే హిందూ పురాణాల ప్రకారం కొన్ని పనులు చేయడం అశుభం.

మార్చి 30 ఆదివారం శ్రీ విశ్వవసునామ సంవత్సరం మొదలు కానుంది. అయితే తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజలు జరుపుకుంటారు. దీనికి శుభ సమయం ఉదయం ఐదు నుంచి 7:30 గంటల మధ్యలో స్నానం, పూజలు కూడా నిర్వహించాలి. అయితే ఆ రోజు కచ్చితంగా ఏదో ఒక నూతన వస్త్రం కూడా ధరించాలని పండితులు చెబుతుంటారు. ఉగాది పండుగ రోజు పచ్చడి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. షడ్ రుచుల పచ్చడి మన జీవితంతో ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉగాది పండుగ రోజు కచ్చితంగా ఉగాది పచ్చడి తయారు చేసుకుంటారు.ఉగాది అంటే యుగాది.. కొత్త సంవత్సరం ప్రారంభం మార్చి 29న శ్రీక్రోధినామ సంవత్సరం ముగుస్తుంది. ఇక 30వ తేదీ నుంచి శ్రీ విశ్వవస్తునామ సంవత్సరం ప్రారంభం కానుంది.

ఉగాది రోజు ఏ పనులు చేయాలి తెలుసుకుందాం..

ఉగాది తెల్లవారుజామున నిద్రలేచి తలంటు స్నానం చేయాలి.

♦ ఆ తర్వాత కొత్త బట్టలు కచ్చితంగా ధరించాలని పండితులు చెబుతారు.

♦ ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులతో అలంకరించుకోవాలి.

♦ ఇక ఉగాది రోజున పూజలు చేయడం వేప పువ్వుతో చేసిన పచ్చడి తీసుకోవడం ముఖ్యం.

ఉగాది రోజు చేయకూడని పనులు ..

♦ ఉగాది రోజు కొన్ని పనులు పొరపాటున కూడా చేయకూడదు లేకపోతే దురదృష్టం వెంటాడుతుంది.

♦ ఉగాది రోజున పెద్ద వారిని తిట్టకూడదు, గొడవలకు దిగకూడదు.

♦ అంతేకాదు అప్పులు ఇవ్వడం.. తీసుకోపోవడం కూడా అశుభం.

♦ ఉగాది రోజు జుట్టు, గోల్లు కూడా కత్తిరించకూడదు.

♦ చినిగిన వస్తువులు ధరించకూడదు.

♦ ఉగాది సాయంత్రం వేళ ఇంటిని ఉడవడం చేయకూడదు.

Show Full Article
Print Article
Next Story
More Stories