US Independence Day 2025: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ఆసక్తికర విషయాలు

US Independence Day 2025
x

US Independence Day 2025: అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం.. ఆసక్తికర విషయాలు

Highlights

US Independence Day 2025: ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశంగా పేరు పొందిన అమెరికా... ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలనలో ఉండటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. దశాబ్దాల పాటు బ్రిటీష్ అధికారులకు లోబడి జీవించిన అమెరికా ప్రజలు చివరకు 1776 జూలై 4న స్వాతంత్య్రాన్ని పొందారు.

US Independence Day 2025: ప్రపంచంలోని అతి శక్తివంతమైన దేశంగా పేరు పొందిన అమెరికా... ఒకప్పుడు బ్రిటిష్ వలస పాలనలో ఉండటం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. దశాబ్దాల పాటు బ్రిటీష్ అధికారులకు లోబడి జీవించిన అమెరికా ప్రజలు చివరకు 1776 జూలై 4న స్వాతంత్య్రాన్ని పొందారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

అమెరికా స్వాతంత్య్రం వెనుక చరిత్ర

అసలు విషయానికి వస్తే, అమెరికాకు స్వాతంత్ర్యం 1776 జూలై 2నే లభించింది. కానీ కాంటినెంటల్ కాంగ్రెస్ జూలై 4న బ్రిటన్ రాజు జార్జ్‌కి స్వతంత్రత ప్రకటనను అధికారికంగా సమర్పించింది. అందుకే జూలై 4ను అమెరికన్ ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నారు. ఆ ప్రకటనపై రాష్ట్రాల ప్రతినిధులు ఆగస్టు 2 నుంచి సంతకాలు పెట్టడం ప్రారంభించారు.

కొలంబస్ వల్ల అమెరికా కనిపెట్టబడినట్లు

భారతదేశానికి చేరడానికి యూరప్ నుంచి బయలుదేరిన క్రిస్టోఫర్ కొలంబస్, అప్రమత్తంగా అమెరికా తీరాలకు చేరుకున్నాడు. ఆ తరువాత ఎన్నో దేశాలు ఈ భూభాగాన్ని తమ అధీనంలోకి తీసుకోవాలని యత్నించగా, బ్రిటీష్ వారు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరి ప్రాంతాన్ని పాలించటం ప్రారంభించారు. భారతదేశంలా అమెరికాలోనూ బ్రిటిష్ పాలన కఠినంగా ఉండింది.

స్వాతంత్య్ర పోరాటం ఎలా మొదలైంది?

1775 ఏప్రిల్‌లో న్యూఇంగ్లాండ్ ప్రాంతంలో బ్రిటిష్ పాలనపై తిరుగుబాటు ప్రారంభమైంది. వర్జీనియాకు చెందిన ప్రతినిధి రిచర్డ్ హెన్రీ లీ జూన్ 7న ఫిలడెల్ఫియాలోని కాంటినెంటల్ కాంగ్రెస్‌లో స్వాతంత్య్రానికి పిలుపు నిచ్చారు. ఆ తర్వాత జూలై 2న స్వతంత్రతకు గల ఓటింగ్ జరగగా, జూలై 4న అధికారిక ప్రకటన వెలువడింది.

మొదటి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

అమెరికాలో మొదటిసారిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని 1777 జూలై 4న ఫిలడెల్ఫియాలో ఘనంగా జరిపారు. ఈ వేడుకలో 13 తుపాకీ కాల్పులు, బాణసంచా ప్రదర్శనలు చేశారు. 1801లో తొలి అధ్యక్షుడు థామస్ జెఫర్సన్ స్వేతసౌధంలో అధికారిక వేడుకలను ప్రారంభించారు. ఆయన రచించిన స్వతంత్ర ప్రకటనే అమెరికా చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన పత్రం. అంతే కాదు, జెఫర్సన్ జూలై 4, 1826న మరణించడం ఒక విశేషం. అదే రోజు అమెరికా రెండవ అధ్యక్షుడు జాన్ ఆడమ్స్ కూడా మరణించారు. 1831 జూలై 4న ఐదవ అధ్యక్షుడు జేమ్స్ మొన్రే మృతిచెందారు.

అమెరికా జాతీయ పతాక విశేషాలు

ప్రస్తుత అమెరికా జాతీయ పతాకంలో ఉండే నక్షత్రాలు వరుసలుగా ఉన్నప్పటికీ, 1776లో ఆ నక్షత్రాలు వలయాకారంలో ఉండేవి. ఇది "అన్ని రాష్ట్రాలు సమానమే" అనే సందేశాన్ని ఇస్తుందన్నది అక్కడి నమ్మకం.

సెలవుగా గుర్తింపు

1870లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం లేని సెలవుగా గుర్తించగా, 1941లో దాన్ని చట్టబద్ధంగా వేతనంతో కూడిన సెలవుగా మార్చారు.

తొలి అధ్యక్షుడికి గౌరవంగా..

స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన జార్జ్ వాషింగ్టన్ అమెరికా తొలి అధ్యక్షుడయ్యారు. ఆయన గౌరవార్థంగా దేశ రాజధానికి వాషింగ్టన్ డీసీ అనే పేరు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories