Viral: నేను సాధించాను..అంటూ పాలతో స్నానం చేసిన వ్యక్తి.. తీరా చూస్తే..

Viral: నేను సాధించాను..అంటూ పాలతో స్నానం చేసిన వ్యక్తి.. తీరా చూస్తే..
x

Viral: నేను సాధించాను..అంటూ పాలతో స్నానం చేసిన వ్యక్తి.. తీరా చూస్తే..

Highlights

ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేసాడు. అయితే అతన్ని ఎందుకు ఈ పాలతో స్నానం చేసావని అడిగితే.. సాధించాను అంటూ చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే..

ఒక వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లీటర్ల పాలతో స్నానం చేసాడు. అయితే అతన్ని ఎందుకు ఈ పాలతో స్నానం చేసావని అడిగితే.. సాధించాను అంటూ చెప్పుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే..

పుణ్యస్నానాలకు వెళ్లి స్నానం చేయడం చూశాం. లేదంటే ఇళ్లలోనే మనసు ప్రశాంతంగా ఉండాలని రెండు పూటలా స్నానం చేయడం చూశాం. కానీ విచిత్రం సాధించానని చెప్పి పాలతో స్నానం చేయడం ఎక్కడైనా చూశామా. విడ్డూరంగానూ విచిత్రంగానూ ఉంది కదూ. మరి అసలు ఈ పాల వెనుక ఏముందో తెలుసుకుందాం.

ఒక వ్యక్తి పాల క్యాన్‌లను ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు. ఏదైనా శుభకార్యముందేమో అని చుట్టుపక్కల వాళ్లు అనుకున్నారు. ఇక అందరూ చూస్తుండగానే షర్ట్ విప్పి స్నానం చేయడం మొదలుపెట్టాడు. స్నానం చేస్తే విడ్డూరమేముందు అని అనకండి. ఎందుకంటే అతగాడు నీళ్లు కాదు ఏకంగా పాలతోనే స్నానం చేశాడు. ఈ సంఘటన ముకల్మువాలో జరిగింది. ఆ వ్యక్తి పేరు మాణిక్ అలీ.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 లీటర్ల పాలతో అలీ స్నానం చేశాడు. తాగడానికి నీళ్లే దొరకని రోజులివి. ఇన్ని పాలతో అతగాడు స్నానం చేయడానికి కారణం ఏమై ఉంటుందనేగా మీ అనుమానం. అదే చెబుతాను.. అతను ఏదో సాధించాడట. సంతోషంగా ఉన్నాడట. ఒక ఇబ్బందికర బంధనం నుండి విముక్తి పొందాడట. ఇలా చెబుతూనే అలి పాలతో స్నానం చేశాడు.

ఇక్కడ దేని గురించి విముక్తి అని ఆలోచిస్తున్నారు కదూ. తన భార్యతో ఆ రోజుతో తెగతెంపులు అయిపోయాయట. కోర్టు ఇద్దరికీ అదే రోజు విడాకులు ఇచ్చిందట. దీంతో అలీ క్యానులతో పాలు తెచ్చుకుని, సాధించాన్నంటూ స్నానం చేశాడు. ఈ స్నానానికి ఏకంగా 40 లీటర్ల పాలునే ఉపయోగించాడు. ఇప్పుడు తను స్వేచ్చగా ఉన్నానని, ఆమె ప్రవర్తన బాగా లేకపోవడం వల్ల విడాకులు తీసుకున్నానని చెబుతున్నాడు. ఆమె ప్రవర్తన బాలేదని విడాకులు తీసుకున్నాడు. సరే. పాలతో స్నానం చేయడం వంటి వింత ప్రవర్తన వల్ల ఆమె ఎంత బాధపడిందో అంటు అక్కడ చుట్టుపక్కలున్నవారు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories