Viral News: భరించలేని కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. తీరా సిటిస్కాన్ తీసి చూస్తే.. డాక్టర్లు షాక్

Viral
x

Viral: భరించలేని కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన వ్యక్తి.. తీరా సిటిస్కాన్ తీసి చూస్తే.. డాక్టర్లు షాక్

Highlights

Viral News: ఒక వ్యక్తి కొన్ని రోజులగా కడుపు నొప్పి రావడంతో పరుగు పరుగున హాస్పిటల్‌కి వెళ్లాడు. దీంతో డాక్టర్లు అతనికి సిటి స్కాన్ చేయించారు.

Viral News: ఒక వ్యక్తి కొన్ని రోజులగా కడుపు నొప్పి రావడంతో పరుగు పరుగున హాస్పిటల్‌కి వెళ్లాడు. దీంతో డాక్టర్లు అతనికి సిటి స్కాన్ చేయించారు. అయితే ఈ రిపోర్ట్‌ చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. కడుపులో ఈల్ చేపలాంటి జీవి ఉంది. ఈ వింత సంఘటన ఎక్కడో కాదు...చైనాలో. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.

వింతలకు పెట్టింది పేరు చైనా. అక్కడ జరిగేది ప్రతీదీ వింతే. తాజాగా కడుపులో ఈల్ లాంటి చేపతో ఒక వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

హునాన్ ప్రావిన్స్‌ లో ఉంటున్న 33 ఏళ్ల ఒక వ్యక్తికి చాలా రోజుల నుంచి కడుపునొప్పితో బాధపడుతున్నాడు. అయితే ఒక రోజు అతను హునాన్ మెడికల్ హాస్పిటల్‌కు వెళ్లి తన బాధకు చెప్పుకున్నాడు. ఇక డాక్టర్లు ఏం చెబుతారు? సిటి స్కీన్ తీస్తేనే కదా కడుపులో ఏముందో తెలిసేది. ఆ డాక్టర్లు కూడా అదే చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే అతని కడుపులో జీవంతో ఒక అడుగు పొడవైన ఈల్ లాంటి జీవిని ఆ స్కానింగ్‌లో గుర్తించారు. ఈ ఘటనతో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది అంతా ఆశ్చర్యపోవడమే కాదు షాకైపోయారు.





ఇంతకీ ఈ వ్యక్తికి కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఆ జీవి పేగుని చీల్చి లోపలికి చొచ్చుకుపోయింది. ఆ ప్రాంతం బలంగా గట్టిగా మారిపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. ఇక ఆ జీవిని తీసేందుకు డాక్టర్లు లాపరోస్కోపిక్ ఆపరేషన్‌ను మొదలుపెట్టారు. ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో కూడా డాక్టర్లు కడుపులోపల చాలా వింతలు చూశారు. పేగులోకి చొచ్చుకుని పోయిన ఈల్ పేగులోని సిగ్మాయిడ్ కొలన్‌ను చీల్చేసింది. దీంతో డాక్టర్లు స్పెషల్ క్లాంప్‌తో దానిని జాగ్రత్తగా బయటకు తీసి ఆపై పేగును కుట్టేశారు. ఆ తర్వాత శరీరాన్ని శుభ్రంగా కడిగి మిగతా ఇన్ ఫెక్షన్ వచ్చే అవకాశాలను నివారించారు.

సర్జరీ విజయవంతం కావడంతో వ్యక్తి కొన్ని రోజుల చికిత్స తర్వాత కోలుకుని ఇంటికి వెళ్లాడు. అయితే ఈల్ అతని కడుపులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం ఎవరికీ తెలియలేదు. అయితే చైనాలో పచ్చి పచ్చి జంతువులను తినడం ఆనవాయితీ కదా. ఎప్పుడో ఒక చిన్న ఈల్ పిల్లను తెలియకుండా మింగేసి ఉంటాడని అందరూ అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories