
Viral Video Mahindra Thar
Viral Video : పదో తరగతి పరీక్షలు ముగిసిన సందర్భంగా ఓ తండ్రి తన కుమారుడికి మహీంద్రా థార్ కారును బహుమతిగా ఇచ్చారు. ఈ వీడియో వైరల్ కాగా, మైనర్‌కు కారు ఇవ్వడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
Viral Video : ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు అడిగింది కొనివ్వాలని, వారిని ఎప్పుడూ సంతోషంగా ఉంచాలని కోరుకుంటారు. కానీ, కొందరు తల్లిదండ్రులు ఇచ్చే బహుమతులు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంటాయి. తాజాగా ఒక జంట తమ కుమారుడు 10వ తరగతి పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి రాగానే ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా కోట్లు పలికే లగ్జరీ కార్లకు ధీటుగా ఉండే మహీంద్రా థార్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
ప్రముఖ కంటెంట్ క్రియేటర్ మకరంద్ తాయడే తన కుమారుడు అర్ణవ్ కోసం ఈ అద్భుతమైన ప్లాన్ చేశారు. అర్ణవ్ పదో తరగతి బోర్డు పరీక్షలు రాసి ఇంటికి రాగానే, తండ్రి అతడి చేతిలో కొత్త కారు తాళాలు పెట్టారు. బయట మెరుస్తున్న తెలుపు రంగు మహీంద్రా థార్‌ను చూడగానే ఆ పిల్లాడి ఆనందానికి అవధుల్లేవు. తన కొడుకు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఖరీదైన బహుమతి కొన్నట్లు ఆ తండ్రి వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన చాలామంది అదృష్టవంతుడైన కొడుకు.. గొప్ప మనసున్న తండ్రి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే, ఈ వీడియోపై ప్రశంసల కంటే విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. పదో తరగతి చదివే పిల్లాడికి కారు గిఫ్ట్‌గా ఇవ్వడం ఏంటని చాలామంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "10వ తరగతి అంటే పట్టుమని 15 లేదా 16 ఏళ్లు కూడా ఉండవు, అప్పుడే కారు స్టీరింగ్ చేతికి ఇస్తారా?" అని కొందరు మండిపడుతున్నారు. ఇది చట్టవిరుద్ధమని, ఇలాంటి వీడియోలు సమాజానికి తప్పుడు సందేశాన్ని ఇస్తాయని మరికొందరు వాదిస్తున్నారు. పిల్లలకు కష్టపడటం నేర్పాలి కానీ, ఇలాంటి విలాసాలు అలవాటు చేయకూడదని హితవు పలుకుతున్నారు.
Parents gift a brand new Mahindra thar to his son because his 10th exam over. 😭 pic.twitter.com/SH0uEH0uLX
— Sumit (@beingsumit01) March 8, 2026
ఈ రచ్చ జరుగుతుందని ముందే ఊహించిన మకరంద్ తాయడే వీడియో కింద ఒక స్పష్టమైన వివరణ ఇచ్చారు. తన కుమారుడు ఇప్పుడే కారు నడపడని, వచ్చే ఐదేళ్ల వరకు కారును తానే లేదా తన భార్య మాత్రమే నడుపుతామని క్లారిటీ ఇచ్చారు. అర్ణవ్ కేవలం వెనుక సీట్లో కూర్చుని ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాడని, అతడికి 18 ఏళ్లు నిండి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే స్టీరింగ్ ఇస్తామని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా, ఒక పిల్లాడు తన పరీక్షల తర్వాత పొందిన ఈ మెగా సర్ప్రైజ్ మాత్రం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




