Viral Video : షూస్ ఆరట్లేదా? ఎండ లేకపోయినా చిటికెలో ఆరిపోయే అదిరిపోయే ట్రిక్

Viral Video : షూస్ ఆరట్లేదా? ఎండ లేకపోయినా చిటికెలో ఆరిపోయే అదిరిపోయే ట్రిక్
x

Viral Video : షూస్ ఆరట్లేదా? ఎండ లేకపోయినా చిటికెలో ఆరిపోయే అదిరిపోయే ట్రిక్

Highlights

Viral Video : చలికాలం వచ్చిందంటే చాలు.. గృహిణులకు బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద టాస్క్. మబ్బు పట్టిన ఆకాశం, ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల ఉతికిన బట్టలు ఆరడానికి రెండు మూడు రోజులు పడుతుంది.

Viral Video : చలికాలం వచ్చిందంటే చాలు.. గృహిణులకు బట్టలు ఆరబెట్టడం ఒక పెద్ద టాస్క్. మబ్బు పట్టిన ఆకాశం, ఎండ సరిగ్గా లేకపోవడం వల్ల ఉతికిన బట్టలు ఆరడానికి రెండు మూడు రోజులు పడుతుంది. ఇక షూస్ లేదా చెప్పుల సంగతి చెప్పక్కర్లేదు. పొరపాటున అవి తడిచినా లేదా ఉతికినా.. లోపల తేమ పోవడానికి తల ప్రాణం తోకకు వస్తుంది. సరిగ్గా ఆరకపోతే వాటి నుంచి వచ్చే దుర్వాసన భరించలేం. ఈ సమస్యకు పరిష్కారంగా ఒక నెటిజన్ అదిరిపోయే టెక్నిక్ కనిపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

చలికాలం, వర్షాకాలంలో తడిచిన బూట్లను ఆరబెట్టడం ఒక పెద్ద సవాల్. సాధారణంగా చాలామంది బూట్లను నేల మీద పెట్టడమో లేదా గోడకు ఆనించి ఉంచడమో చేస్తారు. ఇలా చేయడం వల్ల బూట్ల లోపల ఉన్న నీరు బయటకు పోక, లోపలే తేమ ఉండిపోతుంది. కానీ ఈ వైరల్ వీడియోలో ఒక వ్యక్తి కేవలం ఒక ప్లాస్టిక్ కవర్, రెండు క్లిప్పుల సాయంతో షూస్‌ను అతి తక్కువ సమయంలో ఎలా ఆరబెట్టవచ్చో చూపించాడు. ఈ ట్రిక్ చూసిన వారు "ఇంత సింపుల్ ఐడియా మాకు ఎందుకు రాలేదు" అని ఆశ్చర్యపోతున్నారు.


ఈ చిట్కా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. మొదట ఒక ప్లాస్టిక్ కవర్‌ను తీసుకుని, దాని రెండు చివరలను షూస్ లోపలి భాగంలో లేదా అడుగున సరిగ్గా అమర్చాలి. అంటే షూ కవర్‌కు వేలాడుతున్నట్లు ఉండాలన్నమాట. ఆ తర్వాత ఆ కవర్‌ను బట్టలు ఆరబెట్టే తీగకు రెండు క్లిప్పులతో రివర్స్ గా వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల షూస్ వెనుక భాగం పైకి, ముందు భాగం కిందకు ఉంటుంది. ఈ స్థితిలో షూస్ లోపల ఉన్న నీరంతా గ్రావిటీ వల్ల కిందకు జారిపోయి బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల షూస్ లోపల అసలు నీరు నిల్వ ఉండదు.

సాధారణంగా మనం షూస్‌ను నిటారుగా ఉంచినప్పుడు వాటి ముందు భాగంలో నీరు పేరుకుపోయి ఆరడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈ ట్రిక్ ద్వారా షూస్‌ను తలకిందులుగా వేలాడదీయడం వల్ల లోపల గాలి ప్రసరణ కూడా బాగా జరుగుతుంది. ఎండ లేకపోయినా కేవలం గాలికి కూడా షూస్ త్వరగా ఆరిపోతాయి. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో చందా అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. లక్షలాది మంది ఈ వీడియోను చూసి లైక్ చేస్తున్నారు. సామాన్యులకు ఉపయోగపడే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇప్పుడు నెట్టింట సెన్సేషన్‌గా మారుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories