Viral Video: ఈ చిన్నారి డ్యాన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Viral Video Adorable Small Girl Dance to Bhojpuri Song Wins Hearts Online
x

Viral Video: ఈ చిన్నారి డ్యాన్స్‌ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!

Highlights

Viral Video: సోషల్‌ మీడియా వేదికగా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.

Viral Video: సోషల్‌ మీడియా వేదికగా ఎంతో మంది తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఒకప్పుడు తమలోని ప్రతిభను ప్రదర్శించాలంటే సరైన వేదిక చాలా మంది ఇబ్బందులు పడేవారు. కానీ ఎప్పుడైతే సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిందో. అప్పటి నుంచి ఎవరికి వారే తమన ట్యాలెంట్‌ను ప్రపంచానికి పరిచం చేసుకునే అవకాశం వచ్చింది.

ముఖ్యంగా చిన్నారుల వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాళ్ల ముద్దు ముద్దు చేష్టలు, మాటలు, డ్యాన్స్‌లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఓ బుజ్జి సెలబ్రిటీ తన డ్యాన్స్‌తో అందరి మనసులు గెలుచుకుంటోంది. ఈ చిన్నారి స్టెప్పులు, ఎక్స్‌ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఈ వీడియోలో ఐదేళ్ల అనన్య అనే చిన్నారి ఎల్లో కలర్‌ సారీ కట్టుకుని ‘లక్డీ దివానీ’ అనే భోజ్‌పురి పాటకు అదిరిపోయే డ్యాన్స్‌ చేసింది.

పాటకి తగ్గట్లుగా ఆమె ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ చూసి అందరూ మంత్రముగ్ధులైపోతున్నారు. చిన్న వయసులోనే ఆమె డ్యాన్స్‌ టాలెంట్‌ చూసి నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. లక్షల సంఖ్యలో లైకులు, షేర్లు రావడంతో పాటు అనన్య స్టెప్పులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాండిల్‌ ‘adorable_aanyaa’ అనే పేరుతో ఉంది. ప్రస్తుతం ఈ చిన్నారికి 9 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అనన్య తల్లిదండ్రులు ఆమె సోషల్‌ మీడియా పేజ్‌ను నిర్వహిస్తూ, ఆమె డ్యాన్స్‌ టాలెంట్‌ను అందరికీ చూపిస్తున్నారు.

ఈ బుజ్జి సెలబ్రిటీ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఎనర్జిటిక్‌ స్టెప్పులతో కేవలం ఓ డ్యాన్స్‌ వీడియోతోనే నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఇలాంటి చిన్నారుల టాలెంట్‌ సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి రావడం బాగుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓసారి ఈ వీడియోను చూసేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories