Viral Video: ఒక చేత్తోనే సింహాన్ని తరిమికొట్టిన అమ్మమ్మ..! తన మేకను ఎలా కాపాడుకుందో చూడండి

Viral Video: ఒక చేత్తోనే సింహాన్ని తరిమికొట్టిన అమ్మమ్మ..! తన మేకను ఎలా కాపాడుకుందో చూడండి
x

Viral Video: ఒక చేత్తోనే సింహాన్ని తరిమికొట్టిన అమ్మమ్మ..! తన మేకను ఎలా కాపాడుకుందో చూడండి

Highlights

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అడవికి రాజైన సింహం, ఓ వృద్ధురాలు మధ్య జరిగిన ఈ సంఘటన చూసిన వారందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీడియోలో ఓ ఇంటి ఆవరణలో కట్టివేసిన మేక వద్దకు మెల్లగా చేరుకున్న సింహం దాడి చేసేందుకు సిద్ధమవుతుంది.

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. అడవికి రాజైన సింహం, ఓ వృద్ధురాలు మధ్య జరిగిన ఈ సంఘటన చూసిన వారందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వీడియోలో ఓ ఇంటి ఆవరణలో కట్టివేసిన మేక వద్దకు మెల్లగా చేరుకున్న సింహం దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఇదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న ఒక వృద్ధురాలు బయటకు వచ్చి దృశ్యం చూసి ఒక్కసారిగా ధైర్యంగా ముందడుగు వేసింది.

ఆమె చేతిలో ఉన్నది కేవలం ఒక సాధారణ పాత్ర మాత్రమే. కానీ ఆ గిన్నెతో సింహం తలపై బలంగా కొట్టడంతో, ఆ పెద్ద పులి భయంతో అక్కడినుంచి పరుగులు తీసింది. అమ్మమ్మకు మాత్రం భయం అనే మాటే లేదు. ఎర కోసం వచ్చిన సింహాన్ని, ఇంటి ముందు వీధికుక్కను తరిమినంత ఈజీగా తరిమేసింది. ఈ దృశ్యం చూసిన నెటిజన్లు ఆమె ధైర్యాన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

అయితే ఈ వీడియో నిజమా కాదా అనే చర్చ కూడా నెట్టింట జరుగుతోంది. కొందరు ఇది AI సహాయంతో చేసిన వీడియో కావచ్చని అంటున్నారు. వాస్తవ జీవితంలో ఇలాంటి ఘర్షణ జరగడం అసాధ్యమని భావిస్తున్నారు. అయినప్పటికీ ఈ వీడియోలోని వినోదం, వృద్ధురాలి ధైర్యం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ క్లిప్‌కి ఇప్పటికే వేలల్లో వ్యూస్, లైకులు వచ్చాయి.

ధైర్యం ఎప్పుడూ పెద్ద శక్తి అని నిరూపించేలా ఈ వీడియో నిలిచిపోయింది.



Show Full Article
Print Article
Next Story
More Stories