Viral Video: కోడి కారణంగా స్కూటీ రైడర్‌కు ప్రమాదం – నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో

Viral Video: కోడి కారణంగా స్కూటీ రైడర్‌కు ప్రమాదం – నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో
x

Viral Video: కోడి కారణంగా స్కూటీ రైడర్‌కు ప్రమాదం – నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న వీడియో

Highlights

రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు ఊహించని ఘటనలు మన చేతిలోలేని పరిస్థితుల్లో జరిగిపోతుంటాయి. తాజాగా ఓ స్కూటీ...

రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. కొన్నిసార్లు ఊహించని ఘటనలు మన చేతిలోలేని పరిస్థితుల్లో జరిగిపోతుంటాయి. తాజాగా ఓ స్కూటీ రైడర్‌కు ఎదురైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ కోడి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడం వల్ల అతడు తీవ్రంగా ప్రమాదానికి గురయ్యాడు.

ఈ ఘటనలో స్కూటీ వేగంగా రోడ్డుపై వస్తుండగా, ఓ కోడి దారిలోకి వచ్చేసింది. దాంతో స్కూటీ రైడర్ ఒక్కసారిగా బ్రేక్ కొడతాడు. ఫలితంగా స్కూటీ బ్యాలెన్స్ తప్పి అతడు అడ్డంగా రోడ్డుపై పడిపోతాడు. ఈ దృశ్యాలన్నీ దగ్గరలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. వీడియో చూస్తే, ప్రమాదం ఎంత అనూహ్యంగా జరిగిందో స్పష్టంగా తెలుస్తుంది. కోడి కూడా స్కూటీకి ఢీకొని గాయపడినట్టు కనిపించింది.

ఈ ఘటనపై నెటిజన్ల స్పందన కూడా విశేషంగా ఉంది. ఒక్కరు “దీనికోసమే రోడ్డు మీద అప్రమత్తంగా ఉండమంటారు” అని కామెంట్ చేయగా, మరొకరు “నా జీవితంలో చూసిన అత్యంత ప్రమాదకరమైన కాక్ స్టంట్ ఇదే” అని హాస్యంగా స్పందించారు. ఇక మరొకరు “కోడి వల్ల ఇంత పెద్ద ప్రమాదమా? ఇది నా జీవితంలో ఇదే మొదటిసారి చూశాను” అని పేర్కొన్నారు.

ఈ వీడియో మరోసారి రోడ్డు ప్రయాణాల్లో అప్రమత్తత ఎంత కీలకమో రుజువు చేసింది. చిన్న తప్పిదం అయినా, పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ఈ సంఘటన చూపిస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories