Viral Video: ఆ ఇంట్లో తాచుపాముల గూడు.. గుట్టలుగా పిల్ల పాములు, గుడ్లు.. వీడియో చూసి షాక్‌!

Viral Video: ఆ ఇంట్లో తాచుపాముల గూడు.. గుట్టలుగా పిల్ల పాములు, గుడ్లు.. వీడియో చూసి షాక్‌!
x

Viral Video: ఆ ఇంట్లో తాచుపాముల గూడు.. గుట్టలుగా పిల్ల పాములు, గుడ్లు.. వీడియో చూసి షాక్‌!

Highlights

మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. సాయి నగర్ ప్రాంతంలోని నందు దహ్రియా ఇంట్లో ఓ తాచుపాము కుటుంబం కాపురం పెట్టిందని బయటపడింది. ఒక్కటి కాదు… రెండు కూడా కాదు… ఏకంగా 25 తాచుపాము పిల్లలు ఒక్కటిపై ఒకటి ఇంటి బయటకు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు భయంతో ఒక్కసారిగా గబరిపోయారు.

అయితే అంతటితో వ్యవహారం ముగియలేదు. చిన్న పాము పిల్లలతో పాటు ఒక పెద్ద ఆడ తాచుపాము కూడా కనిపించింది. భయంతో వారు వెంటనే స్నేక్ క్యాచర్ ప్రవీణ్ తివారీకి సమాచారం ఇచ్చారు. ఆయన స్థానానికి చేరుకొని, చిన్న పెద్ద తాచుపాములన్నింటినీ జాగ్రత్తగా పట్టుకున్నాడు.

గుడ్లు తవ్వి బయటపడిన రహస్యాలు

పాములు కనిపించిన చోట నేల తడిగా ఉండటాన్ని గమనించిన ప్రవీణ్… తవ్వినపుడు అక్కడ గుట్టలుగా పాము గుడ్లు బయటపడ్డాయి. ఇవి తాచుపాము పెట్టిన గుడ్లుగా గుర్తించారు. అంతే కాదు, వాటి నుంచి కూడా కొంతమంది పాము పిల్లలు బయటకి వస్తూ ఉండటాన్ని చూసి స్థానికులు షాక్ అయ్యారు.

ఇంట్లో నాగుపాము కుటుంబం కలకలం

ఈ ఘట్టం స్థానికంగా కలకలం రేపింది. కానీ ఉపశమనమైన విషయం ఏమిటంటే — ఈన్ని విషపూరిత తాచుపాములు ఇంట్లో ఉన్నప్పటికీ, ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారు.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కుటుంబ సభ్యులు తీశారు. వీడియోలో పాము పిల్లలు, పెద్ద తాచుపాము, గుడ్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

అడవిలో వదిలివేసిన పాములు

స్నేక్ క్యాచర్ ప్రవీణ్ తివారీ పాములను, పిల్లలను, గుడ్లను సురక్షితంగా పట్టుకుని అడవిలో వదిలేశారని సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories