Viral Video: నాగపంచమికి నాగుపాములతో ఊరేగిన ప్రజలు

Viral Video
x

Viral Video: నాగపంచమికి నాగుపాములతో ఊరేగిన ప్రజలు

Highlights

Viral Video: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమికి నాగపాములతో ఊరేగడం సాధారణంగా జరుగుతు ఉంటుంది.

Viral Video: ఇటీవల బీహార్‌‌లోని సమస్తిపూర్‌‌లోని సింఘియా ఘాట్‌లో వందలాంది మంది నాగపంచమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ ఉత్సవంలో నాగపంచమి మంత్రాలు చదువుతూ.. విషపూరితమైన పాములను మెడలో వేసుకుని ఊరేగారు. దీనికి సంబంధించిన వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వివారాలేంటో తెలుసుకుందాం.

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమికి నాగపాములతో ఊరేగడం సాధారణంగా జరుగుతు ఉంటుంది. ముఖ్యగా బీహార్‌‌లో ఈ పండుగను వందలాది మంది ప్రజలు పాములతో ఊరేగుతారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. అయితే ఈ పాముల జాతరను చూడాలంటే ఎవరైనా భయపడిపోతారు. ఎందుకంటే వాళ్ల చేతుల్లో, మెడల్లో ఉన్నవన్నీ కూడా విషపూరితమైన పాములే.

ఈ ఊరేగింపును కేవలం నాగుల పంచమి రోజు మాత్రమే జరుపుకుంటారు. ఇది వారి సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమం. ఈ పండుగ రోజు సర్పదేవతను పూజిస్తారు. కొండపైన ఉండే నాగదేవత ఆశీర్వాదం పొందేందుకు పెద్ద ఎత్తున పాములను పట్టుకుని ఊరేగితూ కొండ ఎక్కుతారు.

ఈ ఊరేగింపులో కొందరు పాములను మెడ చుట్టూ వేసుకుంటే, మరికొందరు చేతులతో పట్టుకుంటారు. ఇంకొందరు నోటితోనూ పట్టుకుంటారు. ఇలా చేయడం వల్ల అమ్మవారు తమ పూజలను ఒప్పుకుంటారని వీరంతా భావిస్తారు. ఎటువంటి భయంపడకుండా వీరంతా పెద్ద పెద్ద పాములను పట్టుకుని కొండ ఎక్కుతారు. ఈ పండుగను శతాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగిస్తున్నారు.

అయితే వన్యప్రాణ సంరక్షులు మాత్రం దీనిపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఊరేగింపు పేరుతో పాములను ఇలా హింసించడం భావ్యం కాదని , జీవహింసకు అవి గురవుతున్నాయని ఆరోపిస్తున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories