Viral Video: నిజంగానే మర్చిపోయిందా..? లేక యాక్టింగ్‌ చేస్తుందా..? నెట్టింట వైరల్‌ వీడియోపై నెటిజన్స్‌ కామెంట్స్‌

Viral Video: నిజంగానే మర్చిపోయిందా..? లేక యాక్టింగ్‌ చేస్తుందా..? నెట్టింట వైరల్‌ వీడియోపై నెటిజన్స్‌ కామెంట్స్‌
x

Viral Video: నిజంగానే మర్చిపోయిందా..? లేక యాక్టింగ్‌ చేస్తుందా..? నెట్టింట వైరల్‌ వీడియోపై నెటిజన్స్‌ కామెంట్స్‌

Highlights

కొంతమంది మతిమరుపు వల్ల చేసే హాస్యాస్పద సంఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకడం, చేతిలో పెన్ను పెట్టుకుని ఇల్లంతా వెతకడం వంటి సంఘటనలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి.

కొంతమంది మతిమరుపు వల్ల చేసే హాస్యాస్పద సంఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతకడం, చేతిలో పెన్ను పెట్టుకుని ఇల్లంతా వెతకడం వంటి సంఘటనలు అందరికీ నవ్వు తెప్పిస్తాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం నిజంగానే మతిమరుపుతో చేస్తున్నారా? లేక కావాలనే యాక్టింగ్‌ చేస్తున్నారా? అనే సందేహం కలిగిస్తాయి. అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

ఏం జరిగింది?

పెట్రోల్ బంక్‌లో జరిగిన ఈ ఘటనలో, ఒక అమ్మాయి తన స్కూటీకి పెట్రోల్ నింపించి ముందుకు వెళ్తుంది. అయితే పెట్రోల్ నింపే సమయంలో ఎత్తిన స్కూటీ సీటును తిరిగి సర్దకుండా అలాగే వెళ్ళిపోతుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ దృశ్యాన్ని వీడియో తీస్తూ ఆమెను ఆపి, ఆమె చేసిన తప్పును గుర్తు చేస్తాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయికి తాను సీటుపై సరిగ్గా కూర్చోలేదని కూడా తెలియదు. తప్పు గుర్తు చేసినందుకు ఆమె ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెబుతుంది.

వీడియో వైరల్‌ అవుతుండగా నెటిజన్స్‌ కామెంట్స్‌

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వేలాది మంది లైక్‌లు కొడుతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

"ఇలా మర్చిపోయే అలవాటు ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రమాదం జరుగుతుంది," అని ఒకరు కామెంట్ చేశారు.

"ఇది అంతా యాక్టింగ్ మాత్రమే, స్టైల్ చూపించాలనుకున్నది," అని మరోకరు రాశారు.

"ఇలాంటి వీడియోలు ఇప్పుడు వైరల్ కావడానికి వేసే స్ట్రాటజీ మాత్రమే," అని ఇంకొకరు కామెంట్ చేశారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ అవుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories