Viral Video: వర్షాకాలంలో బురద గుంతలు.. ఓపెన్ డ్రెయినేజీలో పడిన దివ్యాంగుడు!

Viral Video: వర్షాకాలంలో బురద గుంతలు.. ఓపెన్ డ్రెయినేజీలో పడిన దివ్యాంగుడు!
x

Viral Video: వర్షాకాలంలో బురద గుంతలు.. ఓపెన్ డ్రెయినేజీలో పడిన దివ్యాంగుడు!

Highlights

వర్షాకాలం రాగానే రోడ్లు గుంతలతో నిండిపోవడం, డ్రెయినేజీలు ఉప్పొంగిపోవడం సహజం. ఎక్కడ ఏ మాన్‌హోల్‌ తెరుచుకుని ఉందో తెలియని పరిస్థితి. అప్రమత్తంగా లేకపోతే క్షణాల్లోనే ప్రమాదం తప్పదు. అలాంటి ఘటన ఢిల్లీలో చోటుచేసుకుని సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇందిరాపురంలో జరిగిన ఈ సంఘటనలో సంతోష్‌ యాదవ్‌ అనే దివ్యాంగుడు స్కూటర్‌తో రివర్స్‌ చేస్తుండగా అదుపుతప్పి ఓపెన్‌ డ్రెయినేజీలో పడిపోయాడు. కాలువ లోతుగా ఉండటంతో పాటు నీళ్లతో నిండిపోయి ఉండటంతో ఆయన పైకి రావడం కష్టంగా మారింది.

స్థానికులు వెంటనే స్పందించి కర్ర నిచ్చెనను అందించి అతన్ని బయటకు లాగారు. ప్రాణాపాయం తప్పించుకున్న సంతోష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వేలాది సార్లు వీక్షించబడింది. దివ్యాంగుడు పడిపోతున్న దృశ్యం చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.

మున్సిపల్‌ నిర్లక్ష్యం పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్లీనింగ్‌ కోసం తెరిచిన డ్రెయినేజీని తిరిగి మూయకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని నెటిజన్లు మండిపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories