Viral Video: పోలీసులకే డ్రైవర్ ఇచ్చిన షాక్.. రోడ్డుపై శిథిలాలు దింపేసి పారిపోయాడు! నెటిజన్స్ షాక్‌!

Viral Video: పోలీసులకే డ్రైవర్ ఇచ్చిన షాక్.. రోడ్డుపై శిథిలాలు దింపేసి పారిపోయాడు! నెటిజన్స్ షాక్‌!
x

Viral Video: పోలీసులకే డ్రైవర్ ఇచ్చిన షాక్.. రోడ్డుపై శిథిలాలు దింపేసి పారిపోయాడు! నెటిజన్స్ షాక్‌!

Highlights

పోలీసులతో అడ్డం పెట్టుకోవడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఓ డంపర్ డ్రైవర్ పోలీసులతో వాగ్వాదం జరిపి, తన కోపాన్ని చూపిస్తూ వారిని ఊహించని రీతిలో షాక్‌కు గురి చేశాడు.

వీడియో ప్రకారం, డ్రైవర్ తన లారీలో ఉన్న శిథిలాలను నేరుగా రోడ్డుపైనే దింపేసి, పోలీసుల ముందే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సంఘటనలో అక్కడే ఉన్న పలువురు పోలీసులు కూడా ఏమీ చేయలేక నిలబడి చూశారంతే. డ్రైవర్ శిథిలాలు రోడ్డంతా పడేసి, తన డంపర్‌తో ప్రశాంతంగా వెళ్లిపోయాడు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందనే దాని పై స్పష్టత లేకపోయినా, వీడియోలో కనిపించిన “చౌదరి మోటార్స్” బోర్డులు మరియు కొన్ని షాపుల ఆధారంగా ఇది మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో జరిగి ఉండవచ్చని చెబుతున్నారు.

47 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే లక్షలాదిమంది వీక్షించారు. నెటిజన్లు విభిన్న రకాల ప్రతిస్పందనలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు—“ఇలాంటి డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తారు. అక్రమ మైనింగ్, ఓవర్‌లోడింగ్ పై పోలీసులు చర్యలు తీసుకునే సమయంలో తప్పించుకోవడానికి, మార్గం మూసేయడానికి ఇలా శిథిలాలను రోడ్డుపై పడేస్తారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం “నేరం చేసినా తప్పించుకోలేడంటూ” ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories