Viral Video: పనికోసం ప్రాణాలు వదిలేస్తారా? ఫైర్‌ అవుతోన్న నెటిజన్స్‌. వైరల్‌ వీడియో

Viral Video
x

Viral Video: పనికోసం ప్రాణాలు వదిలేస్తారా? ఫైర్‌ అవుతోన్న నెటిజన్స్‌. వైరల్‌ వీడియో

Highlights

Viral Video: జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే కష్టపడి పని చేయాలి. యజమాని మెప్పుకోసం అహర్నిశలు కృషి చేయాలి.

Viral Video: జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే కష్టపడి పని చేయాలి. యజమాని మెప్పుకోసం అహర్నిశలు కృషి చేయాలి. సహజంగా చాలామందిలో ఉండే అభిప్రాయం ఇదే. అయితే మనకు పొట్ట నింపే పనే ప్రాణాలు తీసే విధంగా ఉంటే. అలాంటి పని మాకెందుకు? అవసరం లేదని మానేస్తుంటాం. అయితే ఓ యువకుడు మాత్రం పని కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టాడు. మరో అవకాశం ఉన్నా పెద్ద రిస్క్‌ చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే. ఓ యువకుడు కొత్తగా నిర్మాణం జరుగుతోన్న ఇంట్లో ఎలక్ట్రిషియన్‌ వర్క్‌ చేస్తున్నాడు. ఇందుకోసం మరో వ్యక్తి సహాయం తీసుకున్నాడు. ఎలక్ట్రిషియన్‌ లైట్‌ ఫిట్‌ చేసే ప్రాంతం మెట్ల మధ్యలో ఉంది. అక్కడ నిచ్చెన కానీ మరో ప్రత్యామ్నాయ ఏర్పాటు కానీ లేదు. దీంతో మరో వ్యక్తి సహాయం తీసుకున్నాడు. అవతలి వైపు గోడకు నిచ్చెనను అనించి, దానిని ఏటా వాలుగా పెట్టారు.

అయితే నిచ్చెన మరోవైపును ఇంకో వ్యక్తి రెండు కాళ్లతో అడ్డుపెట్టి గోడకు వీపును ఆనించి కూర్చున్నాడు. మొదటి వ్యక్తి ఎంచక్కా నిచ్చెనపైకి ఎక్కి బల్బ్ ఫిట్‌ చేశాడు. వినడానికి చాలా సింపుల్‌గా ఉన్నా చూస్తే మాత్రం గుండె ఆగిపోవడం ఖాయం. పొరపాటున నిచ్చెన చివరల్లో ఉన్న వ్యక్తి ఏమాత్రం కదిలినా అంతే సంగతులు. నేరుగా బిల్డింగ్ కిందపడే ప్రమాదం ఉంది. అయితే అతను మాత్రం ఎలాంటి జంకు లేకుండా ఎంచక్కా బల్బ్‌ ఫిట్ చేసేశాడు.

దీనంతటినీ అక్కడే ఉన్న వారు స్మార్ట్‌ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. మరీ ఇంతలా ప్రాణాలు తెగించి పని చేయడం అవసరమా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మరొకరు స్పందిస్తూ, అసలు అక్కడ బల్బ్‌ ఇవ్వాలని చెప్పిన ఆ డిజైనర్‌ని పట్టుకోవాలి అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. మొత్తంమీద ఇప్పుడీ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories