Viral Video : టికెట్ ధర వేలల్లో..సౌకర్యాలు మాత్రం సున్నా? వైరల్ అవుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ వీడియో

Viral Video : టికెట్ ధర వేలల్లో..సౌకర్యాలు మాత్రం సున్నా? వైరల్ అవుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ వీడియో
x

Viral Video : టికెట్ ధర వేలల్లో..సౌకర్యాలు మాత్రం సున్నా? వైరల్ అవుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ వీడియో

Highlights

Viral Video : దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటిగా పేరున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video : దేశంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో ఒకటిగా పేరున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడికి ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వేల రూపాయలు వెచ్చించి టికెట్ కొన్నా, రైల్వే శాఖ ఇచ్చే సర్వీస్ మాత్రం దారుణంగా ఉందంటూ సదరు ప్రయాణికుడు వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యూఢిల్లీ నుంచి కోల్‌కతా మధ్య నడిచే సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రైళ్లలో ఒకటి. 1454 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 18 గంటల్లో చేరవేసే ఈ రైలులో ప్రయాణం అంటే సామాన్యులకు ఒక కల. ఎందుకంటే ఇందులో 1AC, 2AC, 3AC కోచ్‌లు మాత్రమే ఉంటాయి, టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండవు. అయితే, ఇంతటి భారీ ధరలు చెల్లించి ప్రయాణించే వారికి రైల్వే శాఖ కనీస శుభ్రతను కూడా అందించడం లేదని తాజా ఘటన నిరూపిస్తోంది.

ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సత్య ప్రకాష్ దీక్షిత్ ఇటీవల ఈ రైలులో ప్రయాణించారు. తన ప్రయాణంలో ఎదురైన అపరిశుభ్రతను @thetrainguru అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా బయటపెట్టారు. ఆయన తన వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం.. బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న సమయంలో కొద్దిగా ఆహారం ఆయన కూర్చున్న 2AC సీటు మీద పడింది. దాన్ని శుభ్రం చేద్దామని ఒక టిష్యూ పేపర్‌తో తుడవగా, ఆ టిష్యూ పేపర్ ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. అంటే, ఆ సీటును చాలా కాలంగా సరిగ్గా క్లీన్ చేయలేదని, పైన పేరుకుపోయిన మురికి అలాగే ఉందని స్పష్టంగా కనిపిస్తోంది.

సత్య ప్రకాష్ ఈ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ.. "నేను 2AC టికెట్ కోసం రూ.4,300 కంటే ఎక్కువ ఖర్చు చేశాను. ఇంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా మేము ఇలాంటి మురికి సీట్ల మీద పడుకోవాలా?" అని ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? రైల్వే సిబ్బందా? లేదా క్లీనింగ్ కాంట్రాక్ట్ తీసుకున్న OBHS సిబ్బందా? అని ఆయన నిలదీశారు. రాజధాని లాంటి ప్రీమియం రైళ్లలో ఇలాంటి పరిస్థితులు ఉండటం రైల్వే ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.


ఈ వీడియో ఇప్పటికే 44 వేల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు రైల్వే శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ రైళ్లలో ఎలాగోలా సర్దుకుపోతాము, కానీ రాజధాని లాంటి రైళ్లలో కూడా అదే పరిస్థితి ఉంటే ఎలా అని ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా పలువురు ప్రయాణికులు రాజధాని రైళ్లలో భోజనం నాణ్యత, బొద్దింకల బెడద గురించి ఫిర్యాదులు చేశారు. రైల్వే శాఖ కేవలం టికెట్ ధరలను పెంచడంపైనే కాకుండా, ప్రయాణికుల సౌకర్యాలు, శుభ్రతపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories