Viral Video: సిగ్గు పడాల్సిన విషయం.. భారతీయులు వేసిన చెత్తను విదేశీయులు తీస్తున్నారా?

Viral Video
x

Viral Video: సిగ్గు పడాల్సిన విషయం.. భారతీయులు వేసిన చెత్తను విదేశీయులు తీస్తున్నారా?

Highlights

Viral Video: హిమాచల జలపాతం దగ్గర విదేశీ పర్యాటకులు చెత్తను ఏరుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయులు వేసిన చెత్తను విదేశీయులు ఎత్తడంపై లక్షల సంఖ్యలో నెటిజిన్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Viral Video: హిమాచల జలపాతం దగ్గర విదేశీ పర్యాటకులు చెత్తను ఏరుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయులు వేసిన చెత్తను విదేశీయులు ఎత్తడంపై లక్షల సంఖ్యలో నెటిజిన్లు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎత్తైన పర్వతాలు, జలపాతాలు చూడాలని, ప్రకృతి ఒడిలా కాసేపు అలా సేద తీరాలని ఎవరికి ఉండదు. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్‌లోని జలపాతం ఎంతో అందంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ జలపాతం దగ్గర తీసిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒక విదేశీ పర్యాటకుడు చెత్తను ఏరుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇప్పుడు భారతదేశ పౌరుల బాధ్యతను గుర్తు చేస్తుంది. చెత్తను పడేసి వెళ్లినవారికి ఇది సిగ్గు చేటని చెబుతోంది. ఈ వీడియోని చూసి ప్రతి భారతీయుడు సిగ్గుపడాలని అంటోంది.

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని వాటర్ ఫాల్స్ చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ప్రకృతి ఎంతో పులకరింప జేస్తుంది. అందుకే దేశ, విదేశాల నుంచి పర్యాటకులు ఈ వాటర్‌‌ ఫాల్స్‌ను చూడడానికి వెళుతుంటారు. ఇటీవల ఒక విదేశీయుడు కూడా ఈ వాటర్ ఫాల్‌ని చూడడానికి వెళ్లారు. అయితే అక్కడ పడి ఉన్న చెత్తను ఆయన ఏరుతుంటాడు. మరొక పర్యాటకుడు ఆ దృశ్యాన్ని వీడియోలో బంధిస్తాడు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఈ వీడియో ప్రతి ఒక్కరి చూడాలి. చూసి సిగ్గు పడాలంటూ క్యాప్షన్ పెడతాడు.

నిజంగా ఆ వీడియోలో విదేశీ పర్యాటకుడు ప్లాస్టిక్, చెత్తను ఏరుతూ, చెత్తబుట్టలో వాటిని వేస్తూ కనిపిస్తాడు. అయితే ఇది పోస్ట్ వేసిన వ్యక్తి.. నేను ప్రతిరోజూ ఇక్కడ కూర్చుని చెత్తను ఎత్తి శుభ్రంగా ఉంచమని ప్రజలకు చెబుతాను అని అంటున్నాడు. ఈ వీడియోని నిఖిల్ సైని అనే వ్యక్తి తన ఇన్ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశాడు. ఇప్పటికే ఈ వీడియో 4.4 మిలియన్ల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. ఒక విదేశీ పర్యాటకుడు చెత్తను ఏరుతుంటే సొంత ప్రజలు మురికిని చల్లుతున్నారని చెప్పడం సిగ్గుచేటు. మనకు పరిశుభ్రమైన దేశం కావాలంటే ప్రతి పౌరుడుకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కానీ ఈ సమాజాన్ని శుభ్రంగా ఉంచడం ప్రభుత్వ బాధ్యతని అనుకుంటారు. అయితే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత కూడా అంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories