Viral Video: తిన్నది జీర్ణం చేసుకోవడానికి కింగ్ కోబ్రా చేసిన వింత పనికి నెటిజన్ల షాక్

Viral Video: తిన్నది జీర్ణం చేసుకోవడానికి కింగ్ కోబ్రా చేసిన వింత పనికి నెటిజన్ల షాక్
x

Viral Video: తిన్నది జీర్ణం చేసుకోవడానికి కింగ్ కోబ్రా చేసిన వింత పనికి నెటిజన్ల షాక్

Highlights

పాముల వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కింగ్ కోబ్రా వీడియోలు ఎక్కువగా ఆకట్టుకుంటాయి. కింగ్ కోబ్రా కరిస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయని చెబుతారు. అందుకే దాని పేరు వినగానే చాలామందికి భయం పట్టేస్తుంది.

ఇక తాజాగా కింగ్ కోబ్రా చేసిన ఓ వింత పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. వీడియోలో కింగ్ కోబ్రా తన ఎరను మింగిన తర్వాత తలను నిటారుగా ఉంచి, దవడను విచిత్రంగా కదిలిస్తూ కనిపించింది. సాధారణంగా పాములు కప్పలు, ఇతర జీవులను మింగిన తర్వాత విశ్రాంతి తీసుకుంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం కింగ్ కోబ్రా తిన్న తర్వాత వింతగా ప్రవర్తించింది.

నిపుణుల ప్రకారం, ఈ దవడ కదలికలు ఆహారాన్ని సులభంగా జీర్ణం చేసుకోవడానికే చేస్తుందనేది వివరణ. కొన్ని సెకన్ల పాటు ఈ వింత ప్రవర్తన చేసిన తర్వాత పాము మామూలుగా మారింది.

కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యి, ఇప్పటికే వేలాది మంది వీక్షించగా వందలాది లైకులు, కామెంట్లు వచ్చాయి. కొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతుండగా, మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

వీడియో చూడండి...

Show Full Article
Print Article
Next Story
More Stories