Viral Video: భారీ కింగ్ కోబ్రాను ఒంటి చేత్తో పట్టేశాడు..!

Viral Video: భారీ కింగ్ కోబ్రాను ఒంటి చేత్తో పట్టేశాడు..!
x

Viral Video: భారీ కింగ్ కోబ్రాను ఒంటి చేత్తో పట్టేశాడు..!

Highlights

పాములు అనగానే ఎవరికైనా గుండె దడే. పాములు పట్టే నిపుణులు కూడా ఎంతో జాగ్రత్తగా వాటిని హ్యాండిల్ చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడు మాత్రం ఏ మాత్రం భయపడకుండా భారీ కింగ్ కోబ్రాను ఒంటిచేత్తో పట్టేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు షాక్ తిన్నారు. పాములంటే భయపడే వాళ్లు ఈ వీడియో చూసి ఒళ్లు జలదరిస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఆ యువకుడి ధైర్యాన్ని చూసి చాలామంది అబ్బురపడిపోతున్నారు.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా పనిచేస్తున్న పర్వీన్ కస్వాన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, "కింగ్ కోబ్రా అసలు సైజు ఎప్పుడైనా చూడాలనుకుంటే ఈ వీడియో చూడండి. ఇవి మన దేశంలో ఎక్కడ కనిపిస్తాయో తెలుసా?" అని క్యాప్షన్ జోడించారు.

వీడియోలో ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రా నడుము భాగాన్ని ఎంతో కాన్ఫిడెంట్‌గా పట్టుకుని ఉన్నాడు. పాము పొడవు, ఆకారం చూసి చాలామంది భయంతో పాటు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. “ఇలా దూరంగా ఉంటే మంచిదే” అంటూ వార్నింగ్ కామెంట్లు చేస్తున్నారు.

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషసర్పం. ఇవి దాదాపు 18 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. భారత్‌లో ప్రధానంగా పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, అసోం, మేఘాలయ వంటి ఈశాన్య రాష్ట్రాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఇవి సాధారణంగా మనుషుల నుంచి దూరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories