Viral Video: ఐఫోన్ స్క్రీన్ పని చేయకపోయినా కంప్యూటర్ లా వాడేస్తున్నాడు..వీడి తెలివికి నెటిజన్లు ఫిదా

Viral Video
x

Viral Video: ఐఫోన్ స్క్రీన్ పని చేయకపోయినా కంప్యూటర్ లా వాడేస్తున్నాడు..వీడి తెలివికి నెటిజన్లు ఫిదా

Highlights

Viral Video: ఐఫోన్ అంటేనే ఖరీదైన వ్యవహారం. అలాంటి ఫోన్ పొరపాటున చేయి జారి కింద పడి స్క్రీన్ పగిలిందంటే ఆ యజమాని గుండె ఆగినంత పనవుతుంది.

Viral Video: ఐఫోన్ అంటేనే ఖరీదైన వ్యవహారం. అలాంటి ఫోన్ పొరపాటున చేయి జారి కింద పడి స్క్రీన్ పగిలిందంటే ఆ యజమాని గుండె ఆగినంత పనవుతుంది. రిపేర్ చేయించాలంటే అయ్యే ఖర్చు వింటే చెమటలు పట్టాల్సిందే. ఒక్కోసారి ఆ రిపేర్ ఖర్చుతో ఏకంగా ఒక కొత్త ఆండ్రాయిడ్ ఫోన్ కొనేయొచ్చు. అందుకే చాలామంది పగిలిన స్క్రీన్‌తోనే కాలం వెళ్లదీస్తారు లేదా ఫోన్‌ను మూలన పడేస్తారు. కానీ కోల్‌కతాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తన ఐఫోన్ స్క్రీన్ పూర్తిగా పగిలిపోయినా, టచ్ పని చేయకపోయినా.. అద్భుతమైన ఐడియాతో దాన్ని మళ్లీ వాడుకలోకి తెచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియోను చూస్తే ఆ ఐఫోన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఎవరో సుత్తితో కొట్టినట్లు ఫోన్ స్క్రీన్ మొత్తం ముక్కలు ముక్కలైపోయింది. వెనుక భాగం కూడా పగిలిపోయింది. టచ్ అస్సలు పని చేయడం లేదు. సాధారణంగా ఇలాంటి ఫోన్ చూస్తే ఎవరైనా సరే పనికిరాదని పక్కన పడేస్తారు. కానీ ఈ కుర్రాడు మాత్రం అలా చేయలేదు. తన దగ్గర ఉన్న టెక్నాలజీ తెలివిని ఉపయోగించి ఆ ఫోన్‌ను మళ్లీ పనిచేసేలా చేశాడు.

అతను చేసిన ట్రిక్ చాలా సింపుల్ కానీ సూపర్ ఐడియా. మనం సాధారణంగా కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌కు వాడే వైర్డ్ మౌస్‌ను తన ఐఫోన్‌కు కనెక్ట్ చేశాడు. ఒక చిన్న కనెక్టర్ (OTG Adapter) సాయంతో ఫోన్ ఛార్జింగ్ పోర్ట్‌కు మౌస్‌ను జోడించాడు. అంతే.. మ్యాజిక్ జరిగినట్లు ఐఫోన్ స్క్రీన్ మీద కంప్యూటర్ లాగా ఒక కర్సర్ ప్రత్యక్షమైంది. స్క్రీన్ టచ్ పని చేయకపోయినా, మౌస్‌ను కదుపుతూ ఫోన్ లాక్ తీశాడు. యాప్స్ ఓపెన్ చేయడం, మెనూలోకి వెళ్లడం వంటి పనులన్నీ చకచకా చేసేశాడు. చూస్తుంటే అది ఐఫోన్ లా కాకుండా ఒక చిన్న కంప్యూటర్ లాగా కనిపిస్తోంది.




రిపేర్ సెంటర్‌కు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, కేవలం ఒక చిన్న అడాప్టర్ సాయంతో ఫోన్‌ను మళ్లీ వాడుకలోకి తీసుకురావడం చూసి జనాలు ఫిదా అవుతున్నారు. డిగ్రీ లేని అసలైన ఇంజనీర్ ఇతనే అంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా.. కొత్త ఫోన్ కొనే వరకు లేదా రిపేర్ చేయించే వరకు ఫోన్లోని డేటాను తీసుకోవడానికి, ఫోన్ కాల్స్ చేయడానికి లేదా అత్యవసర పనులకు ఈ జుగాడ్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. మార్కెట్లో దొరికే OTG అడాప్టర్ లేదా Lightning to USB కన్వర్టర్ ఉంటే చాలు. ఒకవేళ మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ స్క్రీన్ పగిలి, డిస్‌ప్లే కనిపిస్తూ కేవలం టచ్ మాత్రమే పని చేయకపోతే.. మౌస్‌ను కనెక్ట్ చేసి ఫోన్‌ను కంట్రోల్ చేయొచ్చు. దీనివల్ల ఫోన్లో ఉన్న ముఖ్యమైన ఫొటోలు, కాంటాక్ట్స్ వంటి డేటాను సేవ్ చేసుకోవడం సులభమవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories