Viral Video: ఏం ట్యాలెంట్‌ గురూ.. పాత బ్రష్‌తో కొత్త హ్యాండిల్!

Viral Video: ఏం ట్యాలెంట్‌ గురూ.. పాత బ్రష్‌తో కొత్త హ్యాండిల్!
x
Highlights

Viral Video: సాధారణంగా, బైక్ బ్రేక్ హ్యాండిల్ విరిగిపోతే కొత్తది కొనుక్కొని అమర్చుకుంటారు.

Viral Video: సాధారణంగా, బైక్ బ్రేక్ హ్యాండిల్ విరిగిపోతే కొత్తది కొనుక్కొని అమర్చుకుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం రూపాయి ఖర్చు లేకుండా విరిగిపోయిన హ్యాండిల్‌కు బదులుగా వినూత్నంగా పరిష్కారం కనుగొన్నాడు. ఇందుకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ప్రతీ ఒక్కరూ తమ ట్యాలెంట్‌ను నెట్టింట ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో, ఒక వ్యక్తి తన ట్యాలెంట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పాత బ్రష్‌ను బైక్ హ్యాండిల్‌గా మార్చేసి, దాన్ని గట్టిగా అమర్చి, సాధారణ బ్రేక్ హ్యాండిల్‌లానే పనిచేయేలా మలిచాడు.

ఈ వీడియో చూసినవారంతా షాక్‌ అవుతున్నారు. అతని ఆలోచనను ప్రశంసిస్తున్నారు. ‘‘అద్భుతమైన ఐడియా’’ అని కొందరు, ‘‘ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో’’ అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు వేలల్లో లైక్‌లు, లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

ఈ తరహా వినూత్న ప్రయోగాలు సామాన్య సమస్యలకు సరళ పరిష్కారాలు చూపించడమే కాక, ఉపయోగం లేకుండా పక్కన పడేసిన వస్తువులను రీయూజ్ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను కలిగిస్తాయని కొందరు నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories