Viral Video : శభాష్ చైనా..రోడ్డుపై పడ్డ సరుకు..లూటీ చేయని జనం..వాళ్లకు ప్రపంచమంతా సెల్యూట్

Viral Video
x

Viral Video : శభాష్ చైనా..రోడ్డుపై పడ్డ సరుకు..లూటీ చేయని జనం..వాళ్లకు ప్రపంచమంతా సెల్యూట్

Highlights

Viral Video : సాధారణంగా రోడ్డు మీద ఏదైనా సరుకుల లారీ పల్టీ కొట్టినా లేదా అందులోని సామాన్లు కింద పడినా.. జనాలు ఎగబడి లూటీ చేయడం మనం చూస్తుంటాం.

Viral Video: సాధారణంగా రోడ్డు మీద ఏదైనా సరుకుల లారీ పల్టీ కొట్టినా లేదా అందులోని సామాన్లు కింద పడినా.. జనాలు ఎగబడి లూటీ చేయడం మనం చూస్తుంటాం. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం మానవత్వం ఇంకా బతికే ఉంది అనిపించక మానదు. చైనాలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. లారీ నుంచి సరుకులు రోడ్డు పాలు కావడంతో అక్కడి స్థానికులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక ట్రక్కు మలుపు తిరుగుతుండగా, అందులో ఉన్న వందలాది ప్యాకెట్లు ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయాయి. క్షణాల్లో రోడ్డంతా సామాన్లతో నిండిపోయింది. సాధారణంగా అయితే ఇలాంటి టైంలో జనాలు తమకు దొరికిన కాడికి ప్యాకెట్లు పట్టుకుని పారిపోతుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అక్కడ ఉన్న జనం ఒక్కరు కూడా ఆ సామాన్లను సొంతం చేసుకోవాలని చూడలేదు. పైగా అటుగా వెళ్తున్న వాహనదారులు, పాదచారులు తమ పనులను ఆపేసి మరీ డ్రైవర్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు.




రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన సరుకులను అందరూ కలిసి గుట్టగా పేర్చారు. ఆ తర్వాత డ్రైవర్‌కు సాయం చేస్తూ వాటన్నింటినీ మళ్ళీ ట్రక్కులోకి ఎక్కించారు. ఒక్కరు కూడా తప్పుగా ప్రవర్తించకుండా, ఎంతో డిసిప్లిన్ తో ఆ పని పూర్తి చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోను ఎక్స్ లో షేర్ చేయగా, ఇప్పటికే 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. "మనం ఇలాంటి విషయాలను ఎప్పుడు నేర్చుకుంటాం?" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఈ వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆ జనాల గొప్పతనాన్ని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం చైనాలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని, లూటీ చేస్తే జైలు శిక్ష లేదా కఠినమైన జరిమానాలు ఉంటాయనే భయంతోనే వాళ్లు సాయం చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. కారణం ఏదైనా, ఒక ఆపదలో ఉన్న వ్యక్తికి అండగా నిలిచి సామాన్లు జాగ్రత్తగా అప్పగించడం మాత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories