Viral Video: ఉబ్బిన పొట్టతో కదులుతున్న కొండచిలువ.. కాసేపటికి ఏం చేశిందో చూస్తే షాక్‌!

Viral Video: ఉబ్బిన పొట్టతో కదులుతున్న కొండచిలువ.. కాసేపటికి ఏం చేశిందో చూస్తే షాక్‌!
x

Viral Video: ఉబ్బిన పొట్టతో కదులుతున్న కొండచిలువ.. కాసేపటికి ఏం చేశిందో చూస్తే షాక్‌!

Highlights

కొండచిలువలు పరిమాణంలోనే కాదు.. బలవంతమైన వేటగాళ్లుగా పేరున్న సర్ప జాతికి చెందినవి. ఇవి పెద్ద జంతువులను సైతం కేవలం బలంతో కుదిపేసి మింగేయగల సామర్థ్యం కలిగినవి.

Viral Video: కొండచిలువలు పరిమాణంలోనే కాదు.. బలవంతమైన వేటగాళ్లుగా పేరున్న సర్ప జాతికి చెందినవి. ఇవి పెద్ద జంతువులను సైతం కేవలం బలంతో కుదిపేసి మింగేయగల సామర్థ్యం కలిగినవి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వింత వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన జార్ఖండ్‌లోని బలేదిహా గ్రామంలో చోటు చేసుకుంది.

వీడియోలో ఒక భారీ కొండచిలువ తన పొట్ట ఉబ్బిన స్థితిలో ముందుకు పాకుతూ కనిపిస్తోంది. అది గులాబీ రంగులో మారిన చర్మంతో, పూర్తిగా తినలేని పరిస్థితిలో ఉంది. కొండచిలువ నక్క కళేబరాన్ని సగం వరకు మింగేసి.. మిగిలిన భాగాన్ని మింగలేక ఇబ్బందిగా కదులుతోంది. కొద్దిసేపటికి మింగిన భాగాన్ని వాంతి చేసి బయటకు తేస్తుంది. ఈ దృశ్యం అక్కడివారిని, వీడియోను చూసిన నెటిజన్లను ఆశ్చర్యపరిచింది.

ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయగా, నెటిజన్ల నుంచి వేల సంఖ్యలో కామెంట్లు, రియాక్షన్లు వస్తున్నాయి. "ఇది ప్రకృతిలో జరిగే అసాధారణ సంఘటన", "వేటలో ఓటమి", "తినలేని లొల్లి" వంటి కామెంట్లు హోరెత్తిస్తున్నాయి.

కొండచిలువలు సాధారణంగా ఎక్కువగా తినవు. అవి ఒకసారి పెద్దగా తిన్నాక దాని జీర్ణ ప్రక్రియకి రోజులు పట్టవచ్చు. పెద్ద కొండచిలువలు నెలరోజులకు ఒక్కసారి మాత్రమే తినడం, లేదా 10 రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం తీసుకోవడం వంటివి కూడా సహజమే. అయితే ఎంత పెద్దదైనా.. కొన్నిసార్లు మించిన భోజనం దారుణ పరిణామాలను తీసుకొస్తుందన్న విషయం ఈ వీడియో మరోసారి గుర్తుచేస్తోంది.











Show Full Article
Print Article
Next Story
More Stories