Viral Video : వడియాల తయారీ చూస్తే వాంతి రావడం ఖాయం..వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Viral Video : వడియాల తయారీ చూస్తే వాంతికి రావడం ఖాయం..వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!
x

Viral Video : వడియాల తయారీ చూస్తే వాంతికి రావడం ఖాయం..వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో!

Highlights

అమృత్‌సరి వడియాలు పంజాబ్ లో చాలా ఫేమస్. అవి అంటే అక్కడ ఇష్టపడని వారుండరు. కూరల్లో వేస్తే ఆ రుచే వేరు.

Viral Video : అమృత్‌సరి వడియాలు పంజాబ్ లో చాలా ఫేమస్. అవి అంటే అక్కడ ఇష్టపడని వారుండరు. కూరల్లో వేస్తే ఆ రుచే వేరు. కానీ, ఈ వడియాలు ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయో చూస్తే మాత్రం.. జీవితంలో మళ్ళీ వాటి జోలికి వెళ్లరు. తాజాగా ఒక ఫుడ్ బ్లాగర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెటిజన్ల గుండెలు పగిలేలా చేస్తోంది. రుచికరమైన ఈ వడియాల వెనుక ఇంత అశుభ్రత దాగి ఉందా అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రముఖ ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ వీడియోలో వడియాల తయారీకి ఉపయోగిస్తున్న మెషీన్లు తుప్పు పట్టి, అత్యంత దారుణంగా ఉన్నాయి. పిండిని కలిపే చోట కనీస శుభ్రత లేదు. అక్కడ పని చేసే వారు కనీసం గ్లౌజులు కూడా వేసుకోకుండా, చెమటలు కక్కుతూ ఆ పిండిని చేతులతోనే కలిపేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే, ఆ పిండిని నేల మీద వేసి కలిపేటప్పుడు కార్మికులు కనీసం చెప్పులు కూడా లేకుండా మురికి కాళ్ళతో అక్కడే తిరుగుతున్నారు.



వడియాలకు ఆకారం ఇచ్చిన తర్వాత వాటిని ఓవెన్‌లో పెట్టే ముందు ఇంటి కప్పుల మీద, డాబాల మీద ఎండబెడుతున్నారు. అక్కడ ఈగలు వాలుతున్నాయి, దుమ్ము పడుతోంది. ఎటువంటి కవర్లు లేకుండా అలా ఆరుబయట వదిలేయడం చూస్తుంటే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో అర్థమవుతోంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్.. "దీనిని మనుషులు కాదు కదా, జంతువులు కూడా తినకూడదు" అని కామెంట్ చేశారు. మరొకరు "రుచి పేరుతో ప్రజలకు విషాన్ని వడ్డిస్తున్నారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియోకు 26 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. బయట దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ మీద ప్రజలకు ఉన్న నమ్మకాన్ని ఈ వీడియో పూర్తిగా దెబ్బతీసింది. అమృత్‌సరి వడియాలు కొనడానికి ముందు వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం ప్యాకింగ్ చూసి మోసపోకుండా, మనం తినే ఆహారం ఎక్కడ తయారవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వీడియో హెచ్చరిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories