Viral Video: ఆ పుష్ప ఎర్ర‌చంద‌నం, మ‌నోడు మందు బాటిళ్లు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Viral Video
x

Viral Video: ఆ పుష్ప ఎర్ర‌చంద‌నం, మ‌నోడు మందు బాటిళ్లు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Highlights

Viral Video: పుష్ప సినిమా ఎంత‌టి విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ సినిమాలో హీరో ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ చేస్తుంటాడు. పోలీసుల క‌ళ్లు గ‌ప్పి ఎర్ర చంద‌నాన్ని ర‌క‌రకాల మార్గాల్లో అడ‌వి దాటించేస్తుంటాడు.

అయితే తాజాగా ఆదిలాబాద్‌లో కూడా ఓ పుష్ప వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చింది. ఇత‌ను ఎర్ర చంద‌నం కాకుండా మందు బాటిళ్ల‌ను స్మ‌గ్లింగ్ చేశాడు. అయితే ఇందుకోసం అత‌ను ఎంచుకున్న మార్గం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళితే ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్య‌క్తి మహారాష్ట్ర నుంచి మద్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో, ప్రత్యేకంగా ఓ జాకెట్ కుట్టించుకున్నాడు. ఆ జాకెట్‌లో ప్రత్యేక పాకెట్లు సిద్ధం చేయించి అందులో 24 దేశీదారు మద్యం సీసాలను దాచి తెచ్చేందుకు ప్రయత్నించాడు.

అయితే అతడి ప్రణాళిక పూర్తిగా వర్కౌట్ కాలేదు. భోరజ్ మండలం పైన పర్యవేక్షణ నిర్వహిస్తున్న అబ్కారీ అధికారులకు అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి, ఆపి తనిఖీ చేశారు. ఆ సమయంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడి స్పెషల్ జాకెట్‌ లోపల మద్యం సీసాలు దాచినట్టుగా గుర్తించారు.

పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతడి వద్ద ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. స్మ‌గ్లింగ్ కోసం మ‌నోడు కుట్టించిన జాకెట్‌ను చూసిన నెటిజ‌న్లు.. పుష్ప‌రాజ్‌తో పోల్చుతూ ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. మ‌రెందుకు ఈ వీడియోను మీరు కూడా ఓ సారి చూసేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories